Motorola Edge 50 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ స్పెషిఫికేషన్లు లీక్..!

ఆప్టిక్స్ వారీగా పరిశీలిస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 నియోలో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ సెకండరీ సెన్సార్, 10ఎంపీ సెన్సార్ కూడా ఉండవచ్చు. అదే సమయంలో, సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం 32ఎంపీ షూటర్ కూడా ఉండవచ్చు.

Motorola Edge 50 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ స్పెషిఫికేషన్లు లీక్..!

Motorola Edge 50 Neo full Specifications leaked ( Image Source : Google )

Motorola Edge 50 Neo Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్లను ప్రవేశపెడుతోంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా నుంచి మోటోరోలా రెజర్ 50 సిరీస్ వరకు లాంచ్ అవుతోంది. అయితే, లెనోవో సబ్-బ్రాండ్ గత ఏడాదిలో మోటోరోలా ఎడ్జ్ 40 నియోకు అప్‌గ్రేడ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 50 నియోను త్వరలో లాంచ్ చేయవచ్చని ఇప్పుడు లీక్‌లు సూచిస్తున్నాయి.

Read Also : Motorola Razr 50 Ultra : మోటోరోలా మడతబెట్టే ఫోన్ వచ్చిందోచ్.. మల్టీ టాస్కింగ్ ఫీచర్లు అదుర్స్.. భారత్‌లో ధర ఎంతంటే?

మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్పెసిఫికేషన్లు :
నివేదిక ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 50 నియో 6.4-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు మాలి-జీ615 జీపీయూ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఇదే ప్రాసెసర్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన సీఎమ్ఎఫ్ ఫోన్ 1 లో చివరిగా కనిపించింది.

ఆప్టిక్స్ వారీగా పరిశీలిస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 నియోలో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ సెకండరీ సెన్సార్, 10ఎంపీ సెన్సార్ కూడా ఉండవచ్చు. అదే సమయంలో, సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం 32ఎంపీ షూటర్ కూడా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 4,310mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా హలో యూఐతో రన్ కావచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ బ్లూటూత్ వెర్షన్ 5.3, ఎన్ఎఫ్‌సీ ఐపీ68 ప్రొటెక్షన్ కలిగి ఉంటుందని లీక్ సూచిస్తుంది. 71.2ఎమ్ఎమ్ x 154.1ఎమ్ఎమ్ x 8.1ఎమ్ఎమ్ కొలతలతో రావచ్చు. 171 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. రాబోయే ఫోన్ నాటికల్ బ్లూ, లాట్టే, గ్రిసైల్, పోయిన్సియానా అనే 4 కలర్ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది.

అదే సమయంలో, ధరల వారీగా ఎడ్జ్ 40 నియో 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 22,999, 12జీబీ ర్యామ్ మోడల్‌కు రూ. 24,999గా నిర్ణయించింది. మోటోరోలా స్మార్ట్‌ఫోన్ గురించి ఇంకా ఎలాంటి ధర వివరాలను నిర్ధారించలేదు. మోటోరోలా ఎడ్జ్ 50నియో ఇదే విధమైన బాల్‌పార్క్‌లో ధర ఉంటుందని ఆశించవచ్చు.

Read Also : Top Smartphone Deals : అమెజాన్‌లో రూ. 20వేల లోపు ధరకే టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్.. లిమిటెడ్ ఆఫర్..!