నీరవ్ మోడీ కార్లు త్వరలో వేలం

  • Published By: madhu ,Published On : April 1, 2019 / 10:02 AM IST
నీరవ్ మోడీ కార్లు త్వరలో వేలం

Updated On : April 1, 2019 / 10:02 AM IST

నీరవ్ మోడీకి చెందిన కార్లను ఈడీ వేలం వేయనుంది. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం కేసులో ప్రధాన నిందితుడు. భారతదేశం వదిలిపెట్టి విదేశాల్లో దర్జాగా తలదాచుకున్న నీరవ్ మోడీ ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. లండన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీకి.. గత శుక్రవారం అక్కడి వెస్ట్‌మినిస్టర్ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఇతనికి చెందిన 13 కార్లను వేలం వేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భావించింది. ఏప్రిల్ 18వ తేదీన వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పెయింటింగ్స్‌ని వేలం వేశారు అధికారులు. వేలం వేయగా రూ. 54.84 కోట్లు వచ్చాయి. 
Read Also : శత్రువుల స్కెచేనా? : 5 ఏళ్ల కొడుకు ఎదుటే తండ్రి హత్య

మంచి కండీషన్‌లో ఉన్న కార్లను వేలం వేసి డబ్బులు రాబట్టుకోవాలని ఈడీ యోచిస్తోంది. లగ్జరీ కార్లు రోల్స్ రాయ్స్ ఘోస్ట్, టొయొటా ఫార్చునర్, ఇన్నోవా, పోర్షె పనమెరా, రెండు మెర్సెడీజ్ బెంజ్, మూడు హోండా కార్లు వేలం వేసే వాటిలో ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన అధికారులు ఈ కార్లను సీజ్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఈ వేలం కాంట్రాక్ట్ అప్పగించారు.  ఏప్రిల్ 26న తదుపరి విచారణ జరిగే వరకు నీరవ్ మోదీ వాండ్స్‌వర్త్ జైల్లోనే ఉండనున్నాడు.

నీరవ్ మోడీ ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఇతనిపై ఆరోపణలున్నాయి. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం బయటకొచ్చింది. ఇందులో అతని పాత్ర ఉందనే అభియోగాలున్నాయి. దేశం విడిచి లండన్ పారిపోయాడు నీరవ్. తమకు అప్పగించాలని భారత్..బ్రిటన్‌ దేశానికి విజ్ఞప్తి కూడా చేసింది. ఇటీవలే ఈయన్ని ఓ పత్రిక ఇంటర్వూ చేసింది. ఖరీదైన అపార్ట్ మెంట్‌లో ఉంటున్నాడని..కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నాడని ఆ పత్రిక ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల అనంతరం నీరవ్ మోడీని అరెస్టు చేశారు పోలీసులు. 
Read Also : జోరువానలోనూ డ్యూటీ : ట్రాఫిక్ పోలీస్ అంకితభావం