ఫోర్బ్స్ పవర్ ఫుల్ వుమెన్ 100లో నిర్మలా సీతారామన్

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిలిచారు. ఫోర్బ్స్ 2019 విడుదల చేసిన 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలకు చోటు దక్కింది. ఈ జాబితాలో నిర్మల సహా హెచ్ సీఎల్ కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రోసిని నాడర్ మల్హోత్రా, బియోకాన్ వ్యవస్థాపకులు కిరన్ మజ్ముదార్ షాలకు చోటు దక్కింది.
‘ప్రపంచ 100 అత్యంత శక్తివంతమైన మహిళలు’ పేరుతో ఫోర్బ్స్ 2019 జాబితాను విడుదల చేసింది. ఇందులో జర్మన్ ఛాన్సలర్ అంగేలా మెర్కెల్ టాప్ ర్యాంకులో నిలిచారు. ఆ తర్వాతి ర్యాంకుల్లో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అధ్యక్షులు క్రిస్టేన్ లాగార్డే రెండో ర్యాంకు, యూఎస్ హౌజ్ స్పీకర్ నాన్సీ పీలోసీ మూడో ర్యాంకులో నిలిచారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా 29 ర్యాంకులో నిలిచారు.
2019లో గ్లోబల్ గా పలు రంగాల్లో నాయకత్వ లక్షణాలు కలిగిన మహిళల్లో ప్రభుత్వం, బిజినెస్, ఫిలాంట్రోఫీ, మీడియా వంటి రంగాల్లో ఎక్కువ మంది నిలిచారు.ఇప్పటివరకూ ఫోర్బ్స్ విడుదల చేసిన పవర్ ఫుల్ వుమెన్స్ జాబితాలో సీతారామన్ 34వ ర్యాంకుతో తొలిసారి చోటు దక్కింది. దేశీయ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా భారతీయ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు.
పోర్ట్ ఫోలియోను పూర్తి స్థాయి కలిగిన తొలి మహిళగా సీతారామన్ నిలిచారు. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అదనపు శాఖగా బాధ్యతలు తీసుకున్నారు. ఫోర్బ్స్ 2019 జాబితాలో నాదర్ మల్హోత్రాకు 54వ ర్యాంకులో నిలిచారు. HCL కార్పొరేషన్ సీఈఓగా వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేసి టెక్నాలజీ కంపనీని 8.9బిలియన్ డాలర్లతో వృద్ధిలోకి తీసుకొచ్చారు. మజ్మూదార్ షా 65వ ర్యాంకులో నిలిచారు.
ఫోర్బ్స్ 100 జాబితాలో పవర్ ఫుల్ వుమెన్ గా చోటు దక్కించుకున్న వారిలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో చైర్ మిలిందా గేట్స్ (6వ ర్యాంకు), ఐబీఎం జిన్ని రోమెట్టీ (9), ఫేస్ బుక్ సీఓఓ షియ్రేల్ శాండ్ బెర్గ్ (18), న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ (38), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ మొదటి కుమార్తె ఇవాంకా ట్రంప్ (42), సింగర్లలో రిహానా (61), బియాన్స్ (66), టేలర్ స్విఫ్ట్ (71), టెన్నీస్ స్టార్ సెరీనా విలియమ్స్ (81), టీనేజ్ క్లయిమేట్ యాక్టివిస్ట్ గ్రీటా థన్ బెర్గ్ (100) స్థానాల్లో నిలిచారు.