ఆఫీస్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌లో హైదరాబాద్‌ దూకుడు.. అద్దె ఆదాయంలో వృద్ధి

గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. వెస్ట్‌ జోన్‌తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్‌ భారీగా ఉంది.

ఆఫీస్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌లో హైదరాబాద్‌ దూకుడు.. అద్దె ఆదాయంలో వృద్ధి

Office Rental Values Rise 8 Percent in Hyderabad

Office Rental Values- Hyderabad: హైదరాబాద్ ముందు నుంచి ఐటీలో మంచి దూకుడు చూపిస్తోంది. అందుకు తోడు ఫార్మా, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫిన్‌ టెక్‌ రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు చేస్తోంది. దీంతో భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్‌లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా జాతీయ అంతర్జాతీయ రియల్ రంగ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ నిర్మాణాలపై దృష్టి సారించాయి. గృహ నిర్మాణ మార్కెట్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో కార్యాలయాల నిర్మాణ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దూకుడు మీదుంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. వెస్ట్‌ జోన్‌తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్‌ భారీగా ఉంది. అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మన విశ్వనగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో.. ప్రస్తుతం ఉద్యోగాల కల్పన కూడా భారీగా పెరిగింది. దీనికి తోడు రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చే అవకాశముండటంతో ఆఫీస్‌ స్పేస్‌కు బూస్టింగ్‌ రానుంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం ఆఫీస్‌ స్పేస్‌ అద్దెల పెరుగుదల శాతం మెరుగ్గా ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నారు. వచ్చే ఏడాది తొలి 6 నెలల్లో అద్దె ఆదాయంలో వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం అద్దెల వృద్ధిలో చెన్నై10 శాతంతో టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. హైదరాబాద్‌ 8 శాతం వృద్ధితో ఆ తర్వాతి స్థానంలో ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజా రిపోర్ట్‌లో తెలిపింది.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ నెలవారీ అద్దె సగటున ఎస్‌ఎఫ్‌టీకి 61 రూపాయలు ఉండగా.. వచ్చే 6 నెలల్లో ఇది 66 రూపాయలకు పెరిగే అవకాశముందనే అంచనాలున్నాయి. ఇక గ్రేడ్‌-A ఆఫీసుల అద్దె హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌టీకి 77 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో అత్యధికంగా ముంబైలో SFT అద్దె 130 రూపాయలు ఉండగా.. అత్యల్పంగా కోల్‌కతాలో 54 రూపాయలుగా ఉంది.

Also Read: హైదరాబాద్ నలువైపులా రియల్ ఎస్టేట్ జోష్.. నార్త్ లో తగ్గేదేలే అంటోన్న నిర్మాణ రంగం

అద్దెల పెరుగుదలలో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. ముంబై, బెంగళూరు, చెన్నై, పూణేలతో పోలిస్తే మన విశ్వనగరంలో అద్దెలు చాలా తక్కువగానే ఉన్నాయి. దీంతో పలు కంపెనీల చూపు ప్రస్తుతం హైదరాబాద్‌పై పడింది.