Bhavish Aggarwal : మస్క్ మామ బాటలో ఓలా బాస్.. ఉద్యోగులకు ‘వీక్లీ రిపోర్టులు’ మస్ట్.. భలే ఫిట్టింగ్ పెట్టాడుగా..!

Bhavish Aggarwal : ఎలన్ మస్క్ అడుగుజాడల్లోనే ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ నడుస్తున్నారు. మస్క్ మామ మాదిరిగానే ఓలా ఉద్యోగులను కూడా వీక్లీ రిపోర్టులు ఇవ్వాల్సిందిగా కంపెనీ సీఈఓ కండీషన్ పెట్టారట..

Bhavish Aggarwal : మస్క్ మామ బాటలో ఓలా బాస్.. ఉద్యోగులకు ‘వీక్లీ రిపోర్టులు’ మస్ట్.. భలే ఫిట్టింగ్ పెట్టాడుగా..!

Bhavish Aggarwal

Updated On : March 5, 2025 / 10:56 AM IST

Bhavish Aggarwal : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. ఎప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆ మస్క్ అడుగుజాడల్లోనే ఓలా బాస్ కూడా నడుస్తున్నారు. మస్క్ మామ బాటలోనే ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్ ఉద్యోగుల కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చారు.

Read Also : BSNL Holi Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు హోలీ ఆఫర్.. వార్షిక ప్లాన్‌తో 30 రోజుల ఫ్రీ వ్యాలిడిటీ.. 60GB ఎక్స్‌ట్రా డేటా..!

తమ కంపెనీలో వర్క్ చేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా వీక్లీ రిపోర్టు ఇవ్వాల్సిందిగా కండీషన్ పెట్టారట.. ఇటీవలే అమెరికాలో ఫెడరల్‌ ఉద్యోగుల పర్ఫార్మెన్స్ గురించి ఫుల్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా మస్క్ మామ ఆదేశించిన సంగతి తెలిసందే.

అక్కడి ఉద్యోగులంతా ప్రభుత్వానికి ఏ విధంగా సాయపడ్డారో వివరించాలని లేదంటే రిజైన్ చేసి వెళ్లిపోవాలని డెడ్‌లైన్‌ పెట్టారు. అదే బాటలో ఓలా బాస్ కూడా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరిని వీక్లి రిపోర్టులు పంపాల్సిందిగా కండీషన్ పెట్టారంటూ నివేదికలు వెల్లడించాయి. దీనిపై గతవారమే ఉద్యోగులకు ఇమెయిల్ కూడా పంపారట.. ‘క్యా చల్‌ రహా హై (ఏం జరుగుతోంది?)’ అనే పేరుతో ఓలా బాస్ మెయిల్‌లో పంపినట్టు తెలిసింది.

ఎవరికి మినహాయింపు లేదు.. అందరూ ఇవ్వాల్సిందే :
ఓలా ఉద్యోగులందరూ ప్రతి వారం కంప్లీట్ చేసిన వర్క్, సాధించిన గోల్స్ వంటివి 3 నుంచి 5 బుల్లెట్‌ పాయింట్లలో అప్‌డేట్స్ ఇవ్వాలని సూచించారు. అందులో చిన్నస్థాయి నుంచి ఉన్నత స్థాయి మేనేజర్ల వరకు అందరూ తమ వర్క్ రిపోర్టు పంపాల్సిందేనని చెప్పారట. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేశారట. ప్రతి ఆదివారం సాయంత్రం వారంలో చేసిన అన్ని టాస్కులకు సంబంధించి ఫుల్ రిపోర్టు రెడీ చేసి పంపాల్సిందిగా సీఈఓ భవీశ్‌ ఆర్డర్ పాస్ చేశారట.

Read Also : Huawei Mate XT : వావ్.. వండర్‌ఫుల్.. మడతబెట్టే ఫోన్ అంట.. ఏకంగా మూడు మడతలు.. ఫోల్డ్ చేస్తే ఫోన్.. ఓపెన్ చేస్తే ల్యాప్‌టాప్..!

ఇప్పటికే ఓలా కంపెనీలో ఉద్యోగుల కోతలు విధించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కంపెనీ నష్టాలను కవర్ చేసేందుకు కాంట్రాక్టు ఉద్యోగులు సహా సుమారు వెయ్యి మందికి లేఆఫ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తుందని తెలిసింది. కస్టమర్ రిలేషన్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పలు విభాగాల్లో కోతలు ఉండనున్నట్లు సమాచారం.