Petrol-Diesel Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..

పెట్రోల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న రికార్డు స్థాయికి చేరుకున్న ఇందన ధరలు గురువారం (జూన్ 17)న స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరగగా.. డీజిల్ లీటర్ ధర 13 పైసలు పెరిగింది.

Petrol-Diesel Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి..

Petrol And Diesel Prices In Your City Today, Check Here

Updated On : June 17, 2021 / 11:18 AM IST

Petrol-Diesel Prices Today : పెట్రోల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న రికార్డు స్థాయికి చేరుకున్న ఇందన ధరలు గురువారం (జూన్ 17)న స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరగగా.. డీజిల్ లీటర్ ధర 13 పైసలు పెరిగింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని అంటున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడంతో ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటేశాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 87.41గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82కు పెరిగింది. లీటర్ డీజిల్
ధర రూ.94.84గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.58 ఉండగా.. డీజిల్ ధర రూ. 90.25గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.91గా ఉంది. డీజిల్ ధర రూ.92.04గా
ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.89 పలకగా.. డీజిల్ ధర రూ.92.66గా ఉంది. ఇప్పటివరకూ జూన్ నెలలో ఇందన ధరలు తొమ్మిది సార్లు పెరిగాయి. మే నెలలో 16 సార్లు పెరిగాయి.

మే 4 నుంచి ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్, కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ.100 మార్క్ దాటేశాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 95.28గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 102.98 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.47లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.27గా ఉంటే.. డీజిల్ ధర రూ.96.47గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.94గా ఉంటే.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది.