బండి నడిచేది ఎలా : గరిష్టస్థాయికి పెట్రో ధరలు

పెట్రో ధరలు ఏ మాత్రం దిగి రానంటున్నాయి. రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. తాజా పెరుగుదలతో పెట్రోల్ ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు రూ. 80పైకి ఎగబాకుతుండడంతో వాహనదారుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాలకు తోడు పెట్రోల్ రేట్లు అధికమౌతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు సామాన్య, మధ్య తరగతి ప్రజలు. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.32కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 74.66గా ఉండగా…చెన్నైలో రూ. 77.62, కోల్ కతాలో రూ. 77.34, బెంగళూరులో రూ. 77.22, హైదరాబాద్‌లో 79.45గా ఉంది.
చమురు ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇతర ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా సమ్మె ప్రభావంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు తమ వాహనాలను బయటకు తీస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు మరింత భారం మోయాల్సి వస్తోంది.
Read More : ఆల్ టైమ్.. రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు
నగరం | పెట్రోల్ | డీజిల్ |
బెంగళూరు | రూ. 77.22 | రూ. 67.97 |
చెన్నై | రూ. 77.62 | రూ. 69.47 |
ఢిల్లీ | రూ. 74.66 | రూ. 95.73 |
హైదరాబాద్ | రూ. 79.45 | రూ. 71.73 |
కోల్ కతా | రూ. 77.34 | రూ. 68.14 |
ముంబై | రూ. 80.32 | రూ. 68.94 |
విశాఖపట్టణం | రూ. 77.91 | రూ. 70.08 |