PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత వస్తోంది.. ఈ ఒక్క మిస్టేక్ చేసినా మీ అకౌంట్లో రూ. 2వేలు పడవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రాబోతున్నాయి. రైతులంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.. ఈలోగా ఈ ఒక్క పని పూర్తి చేసి ఉండండి..

PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత వస్తోంది.. ఈ ఒక్క మిస్టేక్ చేసినా మీ అకౌంట్లో రూ. 2వేలు పడవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

PM Kisan 20th installment

Updated On : July 19, 2025 / 12:53 PM IST

PM Kisan Yojana 20th installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడైనా విడుదల కావచ్చు. మీరు పీఎం కిసాన్ (PM Kisan Yojana) సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైతే.. ఈ విషయం తప్పక తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో PM కిసాన్ యోజన 20వ విడతను విడుదల చేయనుంది. పీఎం కిసాన్ రూ. 2వేలు పడాలంటే అన్ని వివరాలు, డాక్యుమెంట్లు సరిగా ఉండాలి.

లేదంటే రావాల్సిన వాయిదా డబ్బులు ఆగిపోతాయి జాగ్రత్త.. మీరు ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా రావాల్సిన రూ. 2000 మీ అకౌంట్లో పడవు. దాంతో పథకం ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇంతకీ ఏయే పనులను పూర్తి చేసి ఉండాలి? పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఏం చేయాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇ-కేవైసీ ఎందుకంటే? :
ప్రధానమంత్రి కిసాన్ యోజన తదుపరి 20వ విడత పొందాలంటే లబ్ధిదారు రైతు తన బ్యాంకు అకౌంటులో e-KYCని పూర్తి చేయాలి. మీరు ఇంకా ఈ పని చేయకపోతే ప్రభుత్వం అందించే వాయిదాను నిలిపివేయవచ్చు. ఆధార్ వెరిఫైడ్ e-KYC లేకుండా అలా ఉంటే రాబోయే వాయిదాలు విడుదల చేయమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడతపై బిగ్ అప్‌డేట్.. ఈ అర్హతలు కలిగిన రైతులకే రూ. 2వేలు అందుకుంటారు.. ఇప్పుడే ఇలా చేయండి..!

పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. జూలై 19 లేదా 20వ తేదీన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడతను ప్రధాని మోదీ (PM Narendra Modi) విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి కూడా రూ.2వేలు మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ కానున్నాయి.

ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి ఏడాదిలో రైతులకు రూ.6,000 చొప్పున 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి 4 నెలలకు రూ.2వేలు చొప్పున అందజేస్తోంది. మీ డాక్యుమెంట్లలో వ్యక్తిగత వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయకపోతే ఈసారి రూ. 2వేలు అందుకోలేరు.

E-KYC ఎలా పూర్తి చేయాలి? :
1. ఇంటి నుంచే మీ ఫోన్ ద్వారా పూర్తి చేయొచ్చు.
ముందుగా (pmkisan.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
e-KYC ఆప్షన్ క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
OTP ఎంటర్ చేయడం ద్వారా ధృవీకరించండి.

2. మీకు దగ్గరలో CSC సెంటర్ ఉందా? :

  • మీ ప్రాంతంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) వద్దకు వెళ్లండి.
  • ఆధార్ కార్డు.
  • ఫింగర్ ఫ్రింట్ ద్వారా KYC పూర్తి చేసుకోండి.
  • పీఎం కిసాన్ e-KYC చేయించుకోలేని రైతులందరూ ఈరోజే ఆన్‌లైన్‌లో లేదా CSC కేంద్రానికి వెళ్లి తమ KYC చేయించుకోవాలి.
  • అప్పుడే రూ. 2వేలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది.