Hyderabad: హైదరాబాద్లో పుంజుకున్న రియల్ రంగం.. మార్చిలో రూ.3,352 కోట్ల యూనిట్ల రిజిస్ట్రేషన్
లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 2023 మార్చిలో 10 శాతం వైఓవై పెరిగాయి. సంగారెడ్డి జిల్లా మార్చి 2023లో 15 శాతం వైఓవై ఈ ఏటా అత్యధికంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ధర పెరుగుదల ఇటీవలి కాలంలో బలంగా ఉంది. మార్చి 2023లో అధిక విలువ కలిగిన ప్రాపర్టీ అమ్ముడుపోయింది.

Hyderabad real estate
Hyderabad: హైదరాబాద్ మార్చి 2023లో తాజా అసెస్మెంట్లో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలను నమోదు చేసిందని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఈ నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ 3,352 కోట్ల రూపాయిలుగా ఉందని, దానికి 12.2% ఎంఓఎం అదనంగా పెరిగిందని వెల్లడించింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి. సంగారెడ్డి నాలుగు జిల్లాలు ఉన్నాయి.
25 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల ధర మధ్య రెసిడెన్షియల్ యూనిట్ల నమోదులలో మార్చి 2023లో మొత్తం రిజిస్ట్రేషన్లలో చూసుకుంటే 53% పెరుగుదల ఉంది. 25 లక్షల రూపాయల కంటే తక్కువ టిక్కెట్ పరిమాణంలో డిమాండ్ వాటా, మార్చి 2023లో 18%కి చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే తగ్గింది. ఒక కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ ధర పరిమాణాలు ఉన్న ఆస్తుల అమ్మకాల రిజిస్ట్రేషన్ల సంచిత వాటా మార్చి 2022లో 6శాతం ఉండగా 2023 మార్చిలో 10 శాతానికి పెరగడంతో పెద్ద టిక్కెట్ సైజు ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
మార్చి 2023లో, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 500 – 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆస్తుల కేటగిరీలో రిజిస్ట్రేషన్ల వాటా 16 శాతంగా ఉంది. ఇక 1,000-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆస్తుల వాటా అత్యధికంగా 70 శాతం వాటాతో ఉంది. జిల్లా స్థాయిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇళ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్లు 42 శాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 35 శాతం నమోదయ్యాయని అధ్యయనం తెలియజేస్తోంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా మార్చి 2023లో 14 శాతంగా నమోదైంది.
IPL 2023, MI vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ.. Live Updates In Telugu
లావాదేవీలు జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 2023 మార్చిలో 10 శాతం వైఓవై పెరిగాయి. సంగారెడ్డి జిల్లా మార్చి 2023లో 15 శాతం వైఓవై ఈ ఏటా అత్యధికంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ధర పెరుగుదల ఇటీవలి కాలంలో బలంగా ఉంది. మార్చి 2023లో అధిక విలువ కలిగిన ప్రాపర్టీ అమ్ముడుపోయింది.