Realme GT 7 Pro Launch : భారీ బ్యాటరీతో రియల్‌మి జీటీ 7 ప్రో వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే

Realme GT 7 Pro Launch : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ రియల్‌మి జీటీ 7 ప్రో చైనాలో లాంచ్ అయింది.

Realme GT 7 Pro Launch : భారీ బ్యాటరీతో రియల్‌మి జీటీ 7 ప్రో వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే

Realme GT 7 Pro

Updated On : November 5, 2024 / 4:26 PM IST

Realme GT 7 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ రియల్‌మి జీటీ 7 ప్రో చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ కొత్త ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా 16జీబీ వరకు ర్యామ్ కలిగి ఉంది. 120డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తుంది. వైడ్ యాంగిల్‌తో పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో పాటు 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్906 ప్రైమరీ కెమెరాతో వస్తుంది. రియల్‌మి జీటీ 7 ప్రో నవంబర్ 26న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది.

రియల్‌మి జీటీ 7 ప్రో ధర, లభ్యత :
చైనాలో రియల్‌మి జీటీ 7 ప్రో 12జీబీ + 512జీబీ ఆప్షన్ ధర సీన్‌వై 3,699 (సుమారు రూ. 43,800) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 3,999 (దాదాపు రూ. 47,400). అదే సమయంలో, 16జీబీ + 256జీబీ, 16జీబీ + 512జీబీ, 16జీబీ + 1టీబీ వెర్షన్‌లు వరుసగా సీఎన్‌వై 3,899 (దాదాపు రూ. 46,200), సీఎన్‌వై 4,299 (దాదాపు రూ. 50,900), సీఎన్‌‌వై 4,799 ( దాదాపు రూ. 56,900) ఉన్నాయి. ఈ ఫోన్ చైనాలో రియల్‌మి చైనా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ ఎడిషన్, స్టార్ ట్రైల్ టైటానియం, లైట్ డొమైన్ వైట్ కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు.

రియల్‌మి జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి జీటీ 7 ప్రో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,600Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయితో 6.78-అంగుళాల 2కె ఈసీఓ2 స్కై స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ద్వారా 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ 6.0తో వస్తుంది.

కెమెరా విభాగంలో జీటీ 7 ప్రోలో 1/1.56-అంగుళాల 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్906 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ వైడ్-యాంగిల్ షూటర్, 1/1.95-అంగుళాల 50ఎంపీ సోనీతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 120ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్టుతో ఐఎమ్ఎక్స్882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరా 16ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ నీటి అడుగున ఫొటోగ్రఫీ, లైవ్ ఫొటోలు, ఏఐ-బ్యాక్డ్ ఎడిటింగ్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది.

రియల్‌మి జీటీ 7ప్రో 6,500mAh బ్యాటరీతో 120డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్ 4జీ వోల్ట్, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, GALILEO, Beidou, QZSS, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Read Also : iPhone 14 Plus Service : ఆపిల్ ఈ ఐఫోన్ కెమెరాను ఉచితంగా రిపేర్ చేస్తోంది.. మీ దగ్గర ఈ మోడల్ ఉందా? ఎలా చెక్ చేయాలి?