Record Sales for Hyundai : సెప్టెంబర్‌ 2023లో హ్యుందాయ్ రికార్డు సేల్స్.. SUV పోర్ట్‌ఫోలియోలో 71,641 యూనిట్లు

Record Sales for Hyundai : హ్యుందాయ్ అమ్మకాలు సెప్టెంబర్ 2023లో 71,641 యూనిట్లను విక్రయించి 13.35 శాతం వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ SUV పోర్ట్‌ఫోలియోలో Exter, Venue, Creta, Alcazar, Tucson వంటి మోడల్స్ ఉన్నాయి.

Record Sales for Hyundai : సెప్టెంబర్‌ 2023లో హ్యుందాయ్ రికార్డు సేల్స్.. SUV పోర్ట్‌ఫోలియోలో 71,641 యూనిట్లు

Record sales for Hyundai in September 2023, SUVs provide major boost

Record Sales for Hyundai : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) మోడళ్ల ద్వారా బలమైన ప్రదర్శన కారణంగా సెప్టెంబర్ 2023లో ఒక నెలలో అత్యధిక మొత్తం వాల్యూమ్ (దేశీయ + ఎగుమతి)ను నివేదించింది. సెప్టెంబర్ 2023లో హ్యుందాయ్ మొత్తం వాల్యూమ్ ఏడాదికి 13.35శాతం (yoy) పెరిగి 71,641 యూనిట్లకు చేరుకుంది.

Read Also : Upcoming Smartphones October : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ అక్టోబర్‌లో రానున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు, ఆఫర్లు ఏంటో ఓసారి లుక్కేయండి..!

నెలవారీ అమ్మకాల్లో ఇదే అత్యధికం :
గత ఏడాది ఇదే నెలలో, దక్షిణ కొరియా ఆటో దిగ్గజం భారతీయ విభాగం 63,201 యూనిట్లను విక్రయించింది. అధికారిక ప్రకటనలో.. హ్యుందాయ్ COO తరుణ్ గార్గ్ (Hyundai COO Tarun Garg) సెప్టెంబర్ 2023లో, కంపెనీ లాంచ్ అయినప్పటి నుంచి అత్యధిక మొత్తం నెలవారీ అమ్మకాలను సాధించి బ్రాండ్ హిస్టరీలో కీలక మైలురాయిని సాధించింది. కార్‌మేకర్ సెప్టెంబర్ 2023లో దేశీయ విపణిలో 54,241 యూనిట్లను నమోదు చేయగా.. గత ఏడాది నెలలో విక్రయించిన 49,700 యూనిట్ల కన్నా 9.13శాతం వృద్ధిని నమోదు చేసింది.

Record sales for Hyundai in September 2023, SUVs provide major boost

Record Sales for Hyundai : Record sales for Hyundai in September 2023

హ్యుందాయ్ SUV పోర్ట్‌ఫోలియోలో..
పండుగల సీజన్ ఫలితంగా సెప్టెంబరు 2023లో దేశీయ విక్రయాలలో 9శాతం కన్నా ఎక్కువ వృద్ధిని సాధించడంతో బలమైన అమ్మకాలు ఊపందుకున్నాయి. SUV పోర్ట్‌ఫోలియో, కొత్తగా లాంచ్ చేసిన హ్యుందాయ్‌కి అసాధారణమైన కస్టమర్ స్పందనతో మరింత ప్రోత్సాహాన్ని అందుకుంది.

ఇప్పుడు దేశీయ విక్రయాలలో SUVలు 65శాతం కన్నా ఎక్కువ పెరుగుతున్నాయి. హ్యుందాయ్ SUV పోర్ట్‌ఫోలియోలో Exter, Venue, Creta, Alcazar, Tucson వంటి మోడల్స్ ఉన్నాయి. కంపెనీ ఎగుమతి సెప్టెంబర్ 2023లో 28.87శాతం పెరిగి 17,400 యూనిట్లకు చేరుకుంది. సెప్టెంబర్ 2022లో 13,501 యూనిట్లను ఎగుమతి చేసింది.

Read Also : iPhone 12 Sale on Flipkart : రూ.32,999 ధరకే ఆపిల్ ఐఫోన్ 12 సొంతం చేసుకోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనాలా? వద్దా?