అద్భుతమైన ఫీచర్లు, 5G సపోర్టుతో Redmi K30 Pro ఫోన్

చైనీస్ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ బ్రాండ్ Redmi నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. అదే.. Redmi K30 pro స్మార్ట్ ఫోన్. కొన్నివారాల నుంచే ఈ ఫోన్ లాంచ్ తేదీపై రుమార్లు వస్తున్నాయి. రెడ్ మి K30 స్మార్ట్ ఫోన్ లాంచింగ్ తేదీని ప్రకటించింది. ఈ నెలాఖరులో లాంచ్ చేయనుంది.
ముందుగా చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశాక.. తర్వాత గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. Redmi K30 ఫోన్ ఏ తేదీన లాంచ్ అవుతుంది అనేదానిపై కచ్చితమైన సమాచారాన్ని రెడ్ మి జనరల్ మేనేజర్ లువెయిబింగ్ రివీల్ చేయలేదు. మార్చి నెలాఖరులో ప్రవేశపెట్టనున్నట్టు హింట్ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి ఈ డివైజ్ సేల్ ప్రారంభం కానుంది.
రెడ్ మి K30pro వేరియంట్‌లో స్నాప్ డ్రాగన్ 865 మొబైల్ ప్లాట్ ఫాంకు బదులుగా 730G చిప్ సెట్ అమర్చారు. 6.6 అంగుళాల AMOLED డిస్‌ప్లే, రీప్రెష్ రేట్ 90Hz సపోర్ట్ తో వస్తోంది. Mi 10 మాదిరిగానే ఇందులో Full 120Hz రీప్రెష్ రేట్ ఉంది. OLED ప్యానెల్ తోపాటు ఇన్ -డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ అమర్చారు. డివైజ్ కింది భాగంలో స్నాప్ డ్రాగన్ 865 చిప్‌సెట్ ఉంది. 5G సపోర్ట్‌తో Redmi K30 స్మార్ట్ ఫోన్ వస్తుంది.
స్టోరేజీ విషయానికి వస్తే.. 12GB ర్యామ్, LPDDRS టైప్, 256GB, UFS 3.1 స్టోరేజీ ఉంది. MIUI 11 ఆధారిత ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. Redmi K30 వేరియంట్ మాదిరిగానే Redmi K30 pro వెర్షన్ 4,500mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సిస్టమ్ కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. 64MP sony IMX686 సెన్సార్ కూడా ఉంది. 20MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 8MP టెలిఫొటో కెమెరా, 12MP పొర్ట్ ట్రేయిట్ కెమెరాలు ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరాలో 32MP డెప్త్ సెన్సార్ కెమెరా ఉంది.