Redmi Watch 6 : అమోల్డ్ డిస్‌ప్లే, 24 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్‌మి వాచ్ 6 వచ్చేసింది.. ధర ఎంతంటే?

Redmi Watch 6 Launch : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? 24 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్‌మి వాచ్ 6 వచ్చేసింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi Watch 6 : అమోల్డ్ డిస్‌ప్లే, 24 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్‌మి వాచ్ 6 వచ్చేసింది.. ధర ఎంతంటే?

Redmi Watch 6 Launch

Updated On : October 24, 2025 / 1:29 PM IST

Redmi Watch 6 Launch : కొత్త స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? షావోమీ రెడ్‌మి వాచ్ 6, రెడ్‌మి K90 సిరీస్‌తో పాటు చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 2.07-అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లే, 150 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, అడ్వాన్స్ హెల్త్ ట్రాకింగ్ 24 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన రెడ్‌మి వాచ్ 6 అప్‌గ్రేడ్ డిజైన్, మెరుగైన స్పెషిఫికేషన్లతో వస్తుంది. 2.07-అంగుళాల అమోల్డ్ కలర్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ 432×514 పిక్సెల్ రిజల్యూషన్, 82 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది.

2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్,  (Redmi Watch 6 Launch) ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AOD) సామర్థ్యాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. డిస్‌ప్లే 2.5D కర్వ్డ్ గ్లాస్ క్యాప్ ద్వారా మరింత ప్రొటెక్షన్ అందిస్తుంది. వినియోగదారులు పోర్ట్రెయిట్ కస్టమైజేషన్‌లతో సహా అనేక వాచ్ ఫేస్‌లను ఎంచుకోవచ్చు.

పర్ఫార్మెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ :
రెడ్‌మి వాచ్ 6 సూపర్ ఐలాండ్ ఇంటర్‌ఫేస్‌తో షావోమీ సర్జ్ OS 3 ద్వారా పవర్ పొందుతుంది. ఫ్లూయిడ్ పర్ఫార్మెన్స్, డివైజ్ కనెక్టివిటీని కూడా అందిస్తుంది. కన్వర్జ్డ్ డివైస్ సెంటర్‌తో వాచ్ నుంచి ఇతర స్మార్ట్ డివైజ్‌లు, ఆటోమొబైల్స్‌ను కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ రెడ్‌మి వాచ్ విచాట్ క్విక్ రిప్లై, వాయిస్ రిప్లై ఎమోటికాన్‌లకు కూడా సపోర్టు అందిస్తుంది. ట్రావెల్ సమయంలో కమ్యూనికేషన్ టూల్‌గా పనిచేస్తుంది.

Read Also : Reliance Jio : జియో కొత్త గేమింగ్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో అద్భుతమైన బెనిఫిట్స్.. వ్యాలిడిటీ, ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్!

ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్ :
రెడ్‌మి వాచ్ 6 అనేది 150 కన్నా ఎక్కువ స్పోర్ట్ మోడ్‌లతో వస్తుంది. ఇందులో 6 ఆటో-డిటెక్ట్ కలిగి ఉంది. మల్టీ-డైమెన్షనల్ హెల్త్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2), స్లీప్, స్ట్రెస్ ట్రాకింగ్ ఉన్నాయి. స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్ వంటి అనేక సెన్సార్లు ఉన్నాయి.

బ్యాటరీ లైఫ్, కనెక్టివిటీ, ధర :
ఈ స్మార్ట్‌వాచ్ 550mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. వాచ్ 6 రెగ్యులర్ వాడకంతో 12 రోజుల వరకు బ్యాటరీ-సేవర్ మోడ్‌లో 24 రోజుల వరకు లైఫ్ అందిస్తుంది. ఈత, రోజువారీ దుస్తుల కోసం బ్లూటూత్ 5.4, NFC, 5ATM వాటర్ రెసిస్టెన్స్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌వాచ్ ధర CNY 599 (సుమారు రూ. 7,400), షావోమీ చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా బ్లూ మూన్ సిల్వర్, ఎలిగెంట్ బ్లాక్, మిస్టీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. భారతీయ మార్కెట్లో ఈ స్మార్ట్‌వాచ్ లాంచ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ ఏడాది క్రిస్మస్ సమయంలో భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.