Reliance Jio : జియో కొత్త గేమింగ్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో అద్భుతమైన బెనిఫిట్స్.. వ్యాలిడిటీ, ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్!

Reliance Jio : జియో అద్భుతమైన గేమింగ్ ప్లాన్ అందిస్తోంది. జియో రూ. 545 గేమింగ్ ప్లాన్‌లలో అన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

Reliance Jio : జియో కొత్త గేమింగ్ ప్లాన్.. సింగిల్ రీఛార్జ్‌తో అద్భుతమైన బెనిఫిట్స్.. వ్యాలిడిటీ, ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్!

Reliance Jio

Updated On : October 24, 2025 / 11:55 AM IST

Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో అద్భుతమైన గేమింగ్ ప్లాన్ తీసుకొచ్చింది. మీరు స్ట్రీమింగ్, గేమింగ్‌ ఎక్కువగా ఇష్టపడేవారు అయితే ఇది మీకోసమే. ఈ ప్లాన్ ద్వారా రోజంతా డేటా వాడేసుకోవచ్చు. ప్రస్తుతం జియో తమ యూజర్ల కోసం కొన్ని బెస్ట్ గేమింగ్ ప్లాన్‌లను అందిస్తోంది.

ఈ ప్లాన్‌లు గేమింగ్ క్లౌడ్ సర్వీస్‌కు యాక్సెస్ మాత్రమే కాదు.. సబ్‌స్క్రిప్షన్‌లు, బెనిఫిట్స్ కూడా (Reliance Jio) పొందవచ్చు. జియో రూ. 545 గేమింగ్ ప్లాన్‌లలో అన్ని బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు.

రూ. 545 గేమింగ్ ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ :
జియో రూ. 545 గేమింగ్ ప్లాన్ రోజుకు 2GB డేటా, 4G లిమిట్ దాటితే అదనంగా 5GB డేటాతో వస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ కూడా అందిస్తుంది. రియల్ 5G అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ యాక్సస్ పొందవచ్చు.

Read Also : Royal Enfield Meteor 350 : బుల్లెట్ బైక్ కావాలా? కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 వేరియంట్ వారీగా ధరలివే.. ఫుల్ లిస్ట్ ఇదిగో..!

అంటే.. మీ డేటా ఎప్పటికీ అయిపోదు అనమాట. మీరు 5G రెడీ ఫోన్‌తో పాటు 5G డేటాకు సపోర్టు ఉన్న ప్రాంతాలలో ఉంటే సరిపోతుంది. ఈ ప్లాన్ ద్వారా జియోగేమ్స్ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. మీరు 500 కన్నా ఎక్కువ హైడెఫినిషన్ ప్రీమియం గేమ్స్ పొందవచ్చు.

ఈ గేమ్‌లను పీసీ, మొబైల్, ల్యాప్‌టాప్, జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఆడవచ్చు. గేమ్‌ డౌన్‌లోడ్ కోసం కన్సోల్ ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. రూ. 545 జియో ప్లాన్‌తో వినియోగదారులు ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. లేటెస్ట్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా స్పెషల్ స్కిన్ కూపన్‌ కూడా పొందవచ్చు. జియో స్పెషల్ ఆఫర్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. జియోక్లౌడ్‌లో 50GB ఫ్రీ స్టోరేజీ అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 3 నెలల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీగా పొందవచ్చు. మీరు గేమ్స్ ఆడటంతో పాటు బెస్ట్ షోలు, మూవీలను కూడా స్ట్రీమ్ చేయవచ్చు.