Zoho UPI App : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పేకు పోటీగా ‘జోహో యూపీఐ పే’ వచ్చేస్తోందోచ్.. ఇకపై పేమెంట్స్ వెరీ ఈజీ..!
Zoho UPI App : జోహో యూపీఐ పే యాప్ రాబోతుంది. డిజిటల్ పేమెంట్స్ యాప్స్ కన్నా బెటర్ ఫీచర్లను అందించనుంది. జోహో పే ఎలా పనిచేస్తుందంటే?
Zoho UPI App
Zoho UPI App : డిజిటల్ పేమెంట్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో జోహో యూపీఐ పే యాప్ కూడా వచ్చేస్తోంది. డిజిటల్ పేమెంట్ యాప్స్ ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పేకు పోటీగా జోహో యూపీఐ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. అరట్టాయ్ మెసెంజర్‌తో వాట్సాప్‌కు పోటీగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జోహో భారత ఇన్‌స్టంట్ పేమెంట్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.
జోహో కార్ప్‌కు సంబంధించిన (Zoho UPI App) అనేక రిపోర్టులు, ఆ సంస్థ జోహో పేతో రానుందని సూచించాయి. యూపీఐ ఆధారిత వినియోగదారు పేమెంట్లు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. జోహో పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. జోహో పే యాప్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
జోహో పే యాప్ ఎలా పనిచేస్తుందంటే? :
జోహో పే అనేది అరట్టాయ్ మెసెంజర్‌తో ఇంటిగ్రేషన్ అయిన ఒక ఇండిపెండెంట్ అప్లికేషన్. అరట్టాయ్ కమ్యూనికేషన్లు, పేమెంట్లతో డ్యూయల్ వర్కింగ్ యాప్ యాక్సస్ చేయొచ్చు. జోహో కార్ప్ ఇప్పటికే పేమెంట్-అగ్రిగేటర్ లైసెన్స్ కలిగి ఉంది. జోహో బిజినెస్ ద్వారా మర్చంట్ పేమెంట్లను కూడా అందిస్తుంది.
జోహోకు ఇప్పటికే భారీ మొత్తంలో యూజర్ బేస్ కలిగి ఉంది. అతి త్వరలో జోహో యూపీఐ లావాదేవీలు కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి, జోహో పే యాప్ కచ్చితమైన లాంచ్ తేదీపై ఎలాంటి సమాచారం లేదు.
ప్రస్తుతానికి, ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. వచ్చే త్రైమాసికంలో iOS ఆండ్రాయిడ్ రెండింటికీ ఈ యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. అరట్టాయ్ ఇంటిగ్రేషన్‌తో పాటు జోహో పే యాప్ యూజర్లకు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తోంది. డబ్బులు పంపుకోవచ్చు. ఇతరుల పంపిన డబ్బు పొందవచ్చు. యూపీఐ పేమెంట్లు, బిల్లు పేమెంట్స్ వంటివి పూర్తి చేయొచ్చు.
