బిల్‌గేట్స్ కంపెనీలో రిలయన్స్ పెట్టుబడులు

  • Published By: vamsi ,Published On : November 14, 2020 / 09:06 AM IST
బిల్‌గేట్స్ కంపెనీలో రిలయన్స్ పెట్టుబడులు

Updated On : November 14, 2020 / 9:39 AM IST

వాతావరణ మార్పుల సవాళ్లను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏర్పాటు చేసిన బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్‌(బీఈవీ)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 50 మిలియన్ డాలర్లు(రూ. 372కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. రాబోయే 8 నుంచి 10 సంవత్సరాలలో ఈ పెట్టుబడి వాయిదాలలో పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.



బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌లో 50 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది పరిమిత భాగస్వామ్యంతో కొత్తగా ఏర్పడిన అమెరికన్ సంస్థ. శక్తి మరియు వ్యవసాయంలో గణనీయమైన ఆవిష్కరణలతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాతావరణ మార్పుల సవాళ్లను పరిష్కరించడానికి బ్రేక్‌త్రూ ఎనర్జీ ప్రయత్నిస్తోంది.



స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలలో ఆవిష్కరణను ప్రోత్సహించడానికి సంస్థ సేకరించిన నిధులను ఉపయోగిస్తుంది. రాబోయే 8 నుంచి 10 సంవత్సరాలలో దశలవారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ఆవిష్కరణలతో మానవాళికి గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని, ఇన్వెస్టర్లకు కూడా మెరుగైన రాబడులు రాగలవని రిలయన్స్‌ తెలిపింది.