Jio in Education: రామంతపూర్ లోని అరోరా కాలేజీలో 5G సేవలు ప్రారంభం
భారతదేశ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులో జియో ట్రూ 5G సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని బాలాజీ అన్నారు. వేగవంతమైన, విశ్వసనీయమైన కనెక్టివిటీని అందించడం ద్వారా విద్యార్థులకు జియో ట్రూ 5G మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని అన్నారు

Jio 5G: జియో ట్రూ 5G సేవలను హైదరాబాద్‌లోని రామంతపూర్‌లోని అరోరా PG కాలేజ్ (MBA)లో ప్రారంభించారు. తెలంగాణాలో విద్యా సంస్థలకు 5G విస్తరించాలన్న సంకల్పంలో భాగంగా తొలుత ఈ కాలేజీ క్యాంపస్ లో జియో తన సేవలను ప్రారంభించినట్లు జియో తెలంగాణ మొబిలిటీ సేల్స్ హెడ్ బాలాజీ బాబు కోటకొండ అన్నారు. అనంతరం తెలంగాణాలో జియో 5G సేవల విస్తరణ, 5G ప్రయోజనాలు, అవకాశాల గురించి ఆయన వివరించారు. ఈ సేవల ద్వారా జియో అపరిమిత 5G సేవలను కళాశాలలోని అధ్యాపకులు సహా దాదాపు 1700 మంది విద్యార్థులు పొందే వీలు ఉంది.
భారతదేశ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులో జియో ట్రూ 5G సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని బాలాజీ అన్నారు. వేగవంతమైన, విశ్వసనీయమైన కనెక్టివిటీని అందించడం ద్వారా విద్యార్థులకు జియో ట్రూ 5G మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని అన్నారు. అధ్యాపకులు ఉత్తమ పనితీరుకు సహాయ పడుతుంది. కాగా ఈ ప్రారంభోత్సవానికి విద్యార్థులు, అధ్యాపకులు నుంచి మంచి స్పందన లభించినట్లు జియో బృందం తెలిపింది.