పెరుగుతున్న పెట్రో ధరలు: 20 రోజుల్లో రూ.2 పైగా పెరుగుదుల
మొన్నటి దాకా త్గగుముఖం పట్టిన పెట్రో ధరలు గత 20 రోజులుగా పెరుగతూ వస్తున్నాయి. గడచిన 20 రోజుల్లో పెట్రోధరలు 2 రూపాయలుపైగా పెరగటంతో వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల పై పడి వినియోగదారులకు భారం అవుతోంది.

మొన్నటి దాకా త్గగుముఖం పట్టిన పెట్రో ధరలు గత 20 రోజులుగా పెరుగతూ వస్తున్నాయి. గడచిన 20 రోజుల్లో పెట్రోధరలు 2 రూపాయలుపైగా పెరగటంతో వాటి ప్రభావం నిత్యావసర వస్తువుల పై పడి వినియోగదారులకు భారం అవుతోంది.
ఢిల్లీ : దేశంలో పెట్రో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత నెలలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దిగి వచ్చిన ధరలు కొత్త సంవత్సరంలో దాదాపు 2 రూపాయల దాకా పెరిగాయి. జనవరి 1 నుంచి డీజిల్ ధర రూ.2.31 పెరగ్గా, పెట్రోల్ ధర రూ.1.94 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగటం, రూపాయి మారకం విలువ పెరగటం వల్ల పెట్రో కంపెనీలు ధరలు పెంచుకుంటూ వెళుతున్నాయి. ఎన్నికల సమయంలో ధరలు తగ్గించి, ఇప్పుడు పెంచటం పట్ల వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ జనవరి 7న రూ.72.67 పైసలు ఉండగా 10 రోజుల్లో 17 వతేదీ రూ.74.76 గా ఉంది . అలాగే లీటరు డీజిల్ ధర జనవరి 7న రూ.67.66 ఉండగా 17వ తేదీనాటికి రూ.70.42 పైసలుగా ఉంది. పెట్రోల్ తో సమానంగా డీజిల్ ధరలు పెరగటంతో వాటి ప్రభావం నిత్యావసర వస్తువల ధరలపై పడటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.