Rules Changing May 1 : మే 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి.. ఈ 4 రూల్స్ మార్పుతో మీ జేబుకు చిల్లు పడొచ్చు జాగ్రత్త.. ఓసారి చెక్ చేసుకోండి!
Rules Changing May 1 : మే 1 నుంచి కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి.. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాబోయే నాలుగు కొత్త రూల్స్ మీ జేబుకు చిల్లుపడేలా కనిపిస్తోంది..

Rule Changing May 1 _ These 4 rule changes may affect your pocket directly from May 1
Rules Changing May 1 : కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు జరగబోతున్నాయి. మే నెల రానే వచ్చేసింది.. ఈ నెల (మే 1వ తేదీ) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాబోయే ఈ నాలుగు రూల్స్ కారణంగా మీ జేబుకు కూడా చిల్లు పడే పరిస్థితి కనిపిస్తోంది. ఓసారి మీ బడ్జెట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.. లేదంటే.. ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది జాగ్రత్త..
మే నెలలో రాబోయే కొత్త నిబంధనల్లో చాలావరకూ సామాన్యులకు భారంగా మారేలా ఉంది. ముఖ్యంగా బ్యాంకులు ఏటీఏం ఛార్జీలను భారీగా పెంచే అవకాశం ఉంది. అంతేకాదు.. జీఎస్టీలో కూడా మార్పులు ఉండొచ్చు.. గ్యాస్ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. మేలో రాబోయే కొత్త రూల్స్ గురించి ఓసారి వివరంగా తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్స్‌లో కేవైసీ (KYC) :
మీ వ్యాలెట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఈ విషయం వెంటనే తెలుసుకోండి.. కేవైసీ పూర్తి చేసిన ఇ-వాలెట్ల నుంచి మాత్రమే పెట్టుబడుల నగదును తీసుకోవాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ (SEBI) మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకు సూచించింది.
మే 1 నుంచి KYC పూర్తి చేయకపోతే వ్యాలెట్ల నుంచి డబ్బులను డిపాజిట్ చేయలేరు. అందులో భాగంగానే మ్యూచువల్ ఫండ్స్‌లో కేవైసీ తప్పనిసరి చేసింది సెబీ. కేవైసీతో ఇ-వాలెట్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టుకోవచ్చునని సెబీ (SEBI) సూచించింది.

Rules Changing May 1 _ These 4 rule changes may affect your pocket directly from May 1
EPFO పెన్షన్ : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. మీ ఈపీఎఫ్ఓ అకౌంట్లో అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే విషయంలో మరో అవకాశం ఉండొచ్చు. అంటే.. మే 3 వరకు పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు తమ యాజమాన్యాలతో అధిక పెన్షన్ సంబంధించి ఉమ్మడి ఆప్షన్ సమర్పించాలి. అప్పుడు మాత్రమే అధిక పెన్షన్ పొందడానికి వీలుంటుంది.
PNB ఏటీఎం ఛార్జీలు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇవ్వనుంది. ఏటీఎం లావాదేవీలపై కొత్త రూల్స్ తీసుకొస్తోంది. బ్యాంకు వినియోగదారులు మే 1 నుంచి పీఎన్‌బీ అకౌంట్లో నగదు (బ్యాలెన్స్) లేకుండా ATM విత్ డ్రా చేసే సమయంలో ఫెయిల్ అయితే మాత్రం.. రూ.10+ (GST) తప్పక చెల్లించాలి.
LPG గ్యాస్ ధరలు : గ్యాస్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా, ప్రతీ నెల 1న ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరణ చేస్తుంటాయి. మే 1 నుంచి కొత్త నిబంధనలతో గ్యాస్ ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. లేదంటే.. ప్రస్తుత ధర కన్నా తగ్గొచ్చు.. అలానే స్థిరంగానే గ్యాస్ ధరలు ఉండొచ్చు. గత నెలలో (ఏప్రిల్ 1వ) తేదీన గ్యాస్ కమర్షియల్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు రూ.91.50 మేర తగ్గించాయి. ఇప్పుడు గ్యాస్ ధరలను పెంచుతాయో లేదో తగ్గిస్తాయో చూడాలి.
Read Also : New GST Rule : మే 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్.. ట్యాక్స్ పేయర్లకు ఇక దబ్బిడి దిబ్బిడే..!