Samsung Galaxy A34 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A34 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. భారత్‌లో ధర ఎంతంటే?

Samsung Galaxy A34 5G Price : శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో గెలాక్సీ A34 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ లాంచ్ ధర రూ. 30,999 నుంచి రూ. 24,499కి తగ్గింది.

Samsung Galaxy A34 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A34 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. భారత్‌లో ధర ఎంతంటే?

Samsung Galaxy A34 5G Price in India Slashed

Samsung Galaxy A34 5G Price : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A34 5జీ ఫోన్ భారీగా తగ్గింది. ప్రస్తుతం అదనపు బ్యాంక్ ఆఫర్‌లు, పేమెంట్ ఆఫర్‌ల తగ్గింపులతో ఈ 5జీ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. గెలాక్సీ A54 5జీతో పాటుగా 5జీ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది మార్చిలో లాంచ్ అయింది. గెలాక్సీ A34 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 1080 ఎస్ఓసీపై రన్ అవుతుంది.

Read Also : Infinix Note 40 Pro Series : వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతంటే?

5,000ఎంఎహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌, 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో గెలాక్సీ A34 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ లాంచ్ ధర రూ. 30,999 నుంచి రూ. 24,499కి తగ్గింది. ప్రస్తుతం 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 32,999 ఉండగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6,500 ధర తగ్గింపుతో రూ. 26,499కు అందుబాటులో ఉంది.

నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఆఫర్లు :
నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లలో రూ. 4,073 నుంచి ప్రారంభమవుతాయి. నెలకు, ప్రామాణిక ఈఎంఐ ఆప్షన్లు రూ. 1,187 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇంకా, శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే భారీ కొనుగోళ్లు, చెల్లింపులపై శాంసంగ్ మరిన్ని డిస్కౌంట్లను అందిస్తోంది. ధర మరింత తగ్గాలంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఇతర చెల్లింపు ఆఫర్‌లను కూడా కొనుగోలుదారులు పొందవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ A34 5జీపై రూ. 3,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ప్రకటించింది. దాంతో ఈ 5జీ ఫోన్ ధర రూ.27,499కి తగ్గింది.

సంగ్ గెలాక్సీ ఎ34 5జీ స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ సిమ్ (నానో) గెలాక్సీ ఎ34 5జీ ఫుల్-హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, విజిబిలిటీకి విజన్ బూస్టర్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. గెలాక్సీ ఎ34 5జీ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఓఐఎస్‌తో కూడిన 48ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ సెకండరీ సెన్సార్, మాక్రో లెన్స్‌తో కూడిన 5ఎంపీ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 13ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ34 5జీ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో పాటు ఐపీ67-సర్టిఫైడ్ బిల్డ్‌ను కూడా కలిగి ఉంది.

Read Also : Realme Narzo 70 Pro 5G Sale : రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్‌పై స్పెషల్ సేల్ ఆఫర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!