Samsung Galaxy S24 5G : శాంసంగ్ లవర్స్ కోసం కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇలా కొంటే.. ఈ 5G ఫోన్ అతి తక్కువ ధరకే..!

Samsung Galaxy S24 5G : కొత్త శాంసంగ్ గెలాక్సీ S24 5G ధర భారీగా తగ్గింది.. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..

Samsung Galaxy S24 5G : శాంసంగ్ లవర్స్ కోసం కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇలా కొంటే.. ఈ 5G ఫోన్ అతి తక్కువ ధరకే..!

Samsung Galaxy S24 5G

Updated On : July 9, 2025 / 6:31 PM IST

Samsung Galaxy S24 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్‌‌లో డిస్కౌంట్ ధరకే శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ లభిస్తోంది. కెమెరా, పర్ఫార్మెన్స్ పరంగా (Samsung Galaxy S24 5G) శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ కన్నా ముందే తగ్గింపు ధరకే పొందవచ్చు. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.37వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 5G ధర :
రూ. 79,999కి లాంచ్ అయిన ఈ శాంసంగ్ 5G ఫోన్ భారతీయ మార్కెట్లో కేవలం రూ.42,900కి లిస్ట్ అయింది. అంటే.. రూ.37,099 తగ్గింపు పొందింది. శాంసంగ్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.49,999కి కొనుగోలు చేయొచ్చు.

Read Also : YouTube Monetization Rules : క్రియేటర్లకు బ్యాడ్ న్యూస్.. జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్.. ఇకపై అలాంటి ఛానెళ్లకు డబ్బులు రావు..!

శాంసంగ్ గెలాక్సీ S24 కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. HDFC, OneCard, Federal లేదా ఇతర బ్యాంక్ కార్డులపై రూ.1,500 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా, నెలకు రూ.2,080 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.

మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు. బ్రాండ్, మోడల్, వేరియంట్ ఆధారంగా కస్టమర్లు రూ. 40,250 వరకు పొందవచ్చు. ఈ ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

శాంసంగ్ గెలాక్సీ S24 5G స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.2-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ నుంచి పవర్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా లేటెస్ట్ వన్ UI 7 అప్‌డేట్‌పై రన్ అవుతుంది. 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP68 సర్టిఫికేట్ కూడా కలిగి ఉంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ శాంసంగ్ ఫోన్ 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.