SBI Wecare Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో అద్భుతమైన స్కీమ్.. ఇప్పుడే పెట్టుబడి పెట్టండి.. హాయిగా వడ్డీతోనే బతికేయొచ్చు..!

SBI Wecare Scheme : పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఎస్బీఐలో అద్భుతమైన స్కీమ్ ఒకటి. 60ఏళ్లు పైబడిన వాళ్లు ఇప్పుడే పెట్టుబడి పెట్టడండి.. మిగిలిన జీవితమంతా హాయిగా వడ్డీతోనే బతికేయొచ్చు.

SBI Wecare Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఎస్బీఐలో అద్భుతమైన స్కీమ్.. ఇప్పుడే పెట్టుబడి పెట్టండి.. హాయిగా వడ్డీతోనే బతికేయొచ్చు..!

SBI Wecare Scheme

Updated On : March 6, 2025 / 1:54 PM IST

SBI Wecare Scheme : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. దేశంలో కోట్లాది మంది ఎస్‌బీఐ కస్టమర్ల కోసం అనేక అద్భుతమైన డిపాజిట్ స్కీమ్స్ అందిస్తోంది. ఈ పథకాలలో కస్టమర్లు తమ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ లాభాలను ఆర్జించవచ్చు.

అంతేకాదు.. ఎస్బీఐలో ఈ పథకం 100 శాతం సురక్షితం కూడా. పెట్టుబడి పెట్టినవాళ్లు డబ్బు పోతుందనే భయ పడాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి, ఎస్బీఐ వీకేఆర్ పథకం అనేది ఎస్బీఐ అందించే ప్రత్యేకమైన డిపాజిట్ పథకం.

Read Also : Gold Prices Today : బంగారం కొంటున్నారా? చేతిలో డబ్బులు లేవని క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొంటే మీ పని గోవిందా.. తప్పక తెలుసుకోండి!

ఈ పథకాన్ని ఎస్బీఐ సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ పథకంలో తమ డబ్బును పెట్టుబడి పెట్టగలరు. ఎస్బీఐ వీకేర్ పథకం ప్రత్యేక ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్బీఐ వీకేర్ స్కీమ్ :
ఎస్బీఐ (WeCare Scheme) పథకం అనేది డిపాజిట్ స్కీమ్ అనమాట. ఇందులో సీనియర్ సిటిజన్లు తమ డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా భారీ లాభాలను ఆర్జించవచ్చు. ఈ పథకంలో సాధారణ వడ్డీ రేటు కన్నా 0.50 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది.

అంటే.. మీకు 7 శాతం వడ్డీ వస్తుంది. మీ డబ్బును ఎస్బీఐ వీకేర్ పథకంలో ఒక ఏడాది నుంచి 10 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు.. ప్రతి మూడు నెలలకు మీ అవసరాన్ని బట్టి వడ్డీని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.

మార్చి 31లోగా ఇన్వెస్ట్ చేయండి :
ఎస్బీఐ (WeCare) పథకంలో పెట్టుబడి పెట్టడానికి లాస్ట్ డేట్ మార్చి 31, 2025 వరకు మాత్రమే. మీరు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే వెంటనే త్వరపడండి. ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే వీలైనంత త్వరగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడమే మంచిది.

ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ సీనియర్ సిటిజన్లకు మంచి వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ డిపాజిటర్లకు లభించే దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అదనపు వడ్డీ ప్రయోజనాలతో పాటు సీనియర్ సిటిజన్లు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.

ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ కింద వడ్డీ రేట్లు, కాలపరిమితి వడ్డీ రేట్లు పెట్టుబడి కాలపరిమితిని బట్టి మారుతూ ఉంటాయని గమనించాలి. పెట్టుబడిదారులు స్వల్పకాలిక డిపాజిట్ల నుంచి దీర్ఘకాలిక డిపాజిట్ల వరకు వివిధ రకాల మెచ్యూరిటీలను ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లతో పోలిస్తే 0.50శాతం ఎక్కువగా ఉన్నాయి.

స్కీమ్ ఎలా పనిచేస్తుందంటే? :
ఈ పథకం 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంది. ఎస్బీఐ వీకేర్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ఏదైనా SBI బ్రాంచ్‌ను విజిట్ చేయొచ్చు. లేదంటే బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఒక ఫారమ్‌ను నింపాలి. వయస్సు, అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్ సహా అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం జరుగుతుంది.

Read Also : Apple iPhone 14 : బంపర్ ఆఫర్.. ఐఫోన్ 14పై ఏకంగా రూ.51వేలు డిస్కౌంట్.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు..!

కీలక ప్రయోజనాలివే :
అధిక వడ్డీ రేట్లు : సీనియర్ సిటిజన్లు సాధారణ కస్టమర్లతో పోలిస్తే.. వారి పెట్టుబడులపై అధిక రాబడిని పొందుతారు.
కాల వ్యవధి  : పెట్టుబడిదారులు 1 ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్ కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
సెక్యూరిటీ : ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ప్రొటెక్షన్ పొందవచ్చు.