ఇలా కూడా అమ్మేసుకోవచ్చు..కాదేది వ్యాపారానికనర్హం

  • Published By: murthy ,Published On : July 22, 2020 / 09:38 AM IST
ఇలా కూడా అమ్మేసుకోవచ్చు..కాదేది వ్యాపారానికనర్హం

Updated On : July 22, 2020 / 10:57 AM IST

అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. అలాగే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహామ్మారి తో కూడా పారిశ్రామికి వేత్తలు వ్యాపారాలు చేస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి పారిశ్రామిక, వాణిజ్య రంగాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. వాటిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజిలు ప్రకటించింది.

కరోనా బారినుంచి రక్షించుకోటానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అవసరమైన రక్షణ చర్యల చేపడుతున్నారు. శానిటైజర్లు, మాస్క్ లు , మందులు కంపెనీలు, ఆస్పత్రులు కరోనా పేరు చెప్పి తమ ఉత్పత్తులు, సేవలను క్యాష్ చేసుకుంటున్నాయి. మరో వైపు కరోనా నిరోధానికి వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచ మార్కెట్ ను కైవసం చేసుకోటానికి ఫార్మా కంపెనీలు పోటీ పడుతున్నాయి.

లేటెస్ట్ గా ఒక ప్రముఖ బట్టల కంపెనీ యాంటీ కరోనా ఫ్యాబ్రిక్స్ ను తయారు చేసి మార్కెట్ లోకి వదిలింది. దేశంలోని ప్రముఖ వస్త్ర ఉత్పత్తి సంస్ధ సియారామ్స్ ఈ సూటింగ్స్ ను తయారు చేసింది. ఆస్ట్ర్రేలియాకు చెందిన హెల్త్ గార్డ్ సహాకారంతో 99.94% కరోనా నుంచి రక్షించే వస్త్రాలను తయారు చేసినట్లు తన వాణిజ్య ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే కరోనా కషాయం పేరుతో రెస్టా రెంట్లు ఇమ్యునిటీ పవర్ పెంచే కషాయాలు, టీ లు వినియోగదారులకు అందిస్తున్నాయి. త్వరలో కరోనా నుంచి రక్షించబడే టూత్ పేస్టులు,కూల్ డ్రింక్ లు , బిస్కట్ లు, ఇతర ఆహార పదార్ధాలు, వినియోగ వస్తువులు మార్కెట్ ను ముంచెత్తినా ఆశ్యర్య పోనక్కర్లేదు.