Property Prices: మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలతో పాటు అమ్మకాలు కూడా 36 శాతం పెరిగాయని అనరాక్ పేర్కొంది. గత 3 నెలల్లో దేశంలోని 7 మెట్రో నగరాల్లో మొత్తం లక్షా 15 వేల ఒక వంద యూనిట్లు అమ్ముడుపోయాయి.

Property Prices: మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతోన్న ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

property prices across India top metros and Hyderabad

Property Prices Hyderabad: భారత్‌లో నిర్మాణరంగం (Real Estate) స్టేబుల్‌గా కొనసాగుతోంది. అయినప్పటికీ దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో (Metro Cities) ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో గృహాల ధరలు 6 నుంచి 10 శాతం పెరిగినట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ తెలిపింది. మన హైదరాబాద్‌ విషయానికి వచ్చేసరికి గత మూడు నెలల్లో ఇళ్ల ధరలు సుమారు 10శాతం మేర పెరిగాయి.

గత సంవత్సరం భాగ్యనగరంలో ఇదే సమయంలో 11 వేల 190 ఇళ్ల అమ్మకాలు జరగ్గా ఇప్పుడు జూన్ త్రైమాసికంలో 13 వేల 570 యూనిట్లు అమ్ముడయ్యాయని అనరాక్ నివేదిక స్పష్టం చేసింది. అంటే హైదరాబాద్ లో గత సంవత్సరం కంటే ఈసారి 21 శాతం మేర ఇళ్ల అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది. ఇక దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలతో పాటు అమ్మకాలు కూడా 36 శాతం పెరిగాయని అనరాక్ పేర్కొంది. గత 3 నెలల్లో దేశంలోని 7 మెట్రో నగరాల్లో మొత్తం లక్షా 15 వేల ఒక వంద యూనిట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో సేల్స్‌ 84 వేల 940 యూనిట్లుగా ఉన్నాయి.

Also Read: కోటి రూపాయలకు మించి ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా ఉందంటే..

ఇక జూన్‌ త్రైమాసికంలో దేశంలో అత్యధికంగా పూణేలో ఇళ్ల అమ్మకాలు 65 శాతం పెరగ్గా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కేవలం 7 శాతం మాత్రమే పెరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో గృహ రుణాల రేట్ల పెంపు ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక సమస్యల ప్రభావం ఇంకా హౌసింగ్‌ మార్కెట్‌పై పడలేదని, వచ్చే ఆరు నెలల కాలంలోనూ అమ్మకాల డిమాండ్‌ బలంగానే ఉంటుందని అనరాక్‌ అంచనా వేస్తోంది.

Also Read: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేస్తాం : ఈవో ధర్మారెడ్డి