Stock Market : లాభాల జోరుకు బ్రేక్, ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్

కొన్ని రోజులుగా రికార్డులతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు నేడు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 7న ఇంట్రాడేలో రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత బెంచ్ మార్క్ సూచీలు అస్థిరత

Stock Market : లాభాల జోరుకు బ్రేక్, ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్

Stock Market

Updated On : September 7, 2021 / 5:56 PM IST

Stock Market : కొన్ని రోజులుగా రికార్డులతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు నేడు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 7న ఇంట్రాడేలో రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత బెంచ్ మార్క్ సూచీలు అస్థిరత మధ్య స్వల్పంగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ కాస్త హెచ్చు తగ్గుల తర్వాత నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 17.43 పాయింట్లు (0.03 శాతం) తగ్గి స్పల్ప నష్టంతో 58,279.48 దగ్గర ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 15.70 పాయింట్లు నష్టపోయి (0.09 శాతం) 17,362.10 దగ్గర ముగిసింది. గత వారంలో సెన్సెక్స్ 2,005.23 పాయింట్లు అంటే 3.57 శాతం పెరిగింది.

Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!

సెన్సెక్స్‌ 30 షేర్లలో 12 లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌ షేర్లు మెరిశాయి. టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, ఎస్బీఐ డీలాపడ్డాయి.

Apple Next iPhones : భారీగా పెరగనున్న ఐఫోన్ల ధరలు.. అసలు కారణం ఇదే!

సెన్సెక్స్-నిఫ్టీ సోమవారం రికార్డు స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్ 166.96 పాయింట్ల (0.29 శాతం) లాభంతో 58,296.91 దగ్గర ముగిసింది. నిఫ్టీ 54.20 పాయింట్ల (0.31 శాతం) లాభంతో 17,377.80 దగ్గర ముగిసింది.