Stock Markets : ఆల్ టైమ్ రికార్డు.. లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ సూచీలు లాభాల జోరు కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 13) కూడా స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఈ రోజు ఉదయం నుంచి బుల్ రన్ దూసుకెళ్లడంతో మార్కెట్లు భారీ లాభాలతో జోష్ మీదనున్నాయి. సూచీల జోరుతో మదుపర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డును తాకింది.

Stock Market Highlights
Stock Market Highlights: దేశీయ స్టాక్ సూచీలు లాభాల జోరు కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 13) కూడా స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఈ రోజు ఉదయం నుంచి బుల్ రన్ దూసుకెళ్లడంతో మార్కెట్లు భారీ లాభాలతో జోష్ మీదనున్నాయి. సూచీల జోరుతో మదుపర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డును తాకింది. ఉదయం నుంచి సెన్సెక్స్ లాభాలతో సూచీలు కొనసాగగా.. సెన్సెక్స్ 55,000 మార్క్ ను దాటేసింది. అలాగే నిఫ్టీ కూడా 16,500 మార్క్ చేరుకుంది. కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు పైకి ఎగబాకాయి.
ఒకవైపు ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలు ఎదురైనప్పటికీ బుల్ వేగం ఎక్కడా తగ్గలేదు. అదే దూకుడుతో ఆల్ టైమ్ రికార్డును చేరింది. మొదటి త్రైమాసిక ఫలితాలు అనుకూలంగా ఉండటం బాగా కలిసొచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటం వంటి కారణాలతో దేశీయ సూచీలు లాభాల పట్టాయి. స్టాక్ మార్కెట్లు చివరకు సెన్సెక్స్ 593 పాయింట్ల లాభంతో 55,437 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ మొదటిసారి 164 పాయింట్లు పైకి ఎగబాకి 16,529 పాయింట్ల వద్ద ట్రేడింగ్ తో ముగిసింది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ కూడా రూ.74.26 వద్ద ట్రేడ్ అయింది.
Stock investors : స్టాక్ మార్కెట్ లను ముంచెత్తిన కరోనా, 30 నిమిషాలు..5 లక్షల 27 వేల కోట్ల సంపద ఆవిరి
BSE 30 సూచీలో TCS, L&T, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, రిలయన్స్, HCL Tech, ఇన్ఫోసిస్, ITC, Tata Steel, HDFC Bank, SBI షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫినాన్స్, NTPC, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, మారుతీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల బాటపట్టాయి.