ఎయిర్ పోర్టు వ్యాపారంలోకి టాటాలు : GMRలో 8 వేల కోట్ల పెట్టుబడులు

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 02:45 AM IST
ఎయిర్ పోర్టు వ్యాపారంలోకి టాటాలు : GMRలో 8 వేల కోట్ల పెట్టుబడులు

Updated On : March 28, 2019 / 2:45 AM IST

టాటాలు ఎయిర్ పోర్టు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాయి. భారతదేశంలో అతి పెద్ద విమానాశ్రయం GMR ఎయిర్ పోర్టు లిమిటెడ్‌లో టాటాగ్రూపు కన్సార్షియం, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ GIC, SSG క్యాపిటల్ మేనేజ్ మెంట్‌లు రూ. 8వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. GMR ఎయిర్ పోర్టులో తక్షణమే రూ. 1000 కోట్లు పెట్టబడులు పెట్టబోతోంది. మరో రూ. 7వేల కోట్లతో ఎయిర్ పోర్టు యూనిట్ ఈక్విటీ షేర్లను కొనుగులు చేస్తుంది.

వాటాలు కొనుగోలు చేసిన తర్వాత టాటాలకు జీఎంఆర్ ఎయిర్ పోర్టు యూనిట్‌లో 20 శాతం వాటాలు లభిస్తే..జీఐసీకి 15 శాతం, ఎస్ఎస్‌జీకి పది శాతం వాటాలు లభిస్తాయని జీఎంఆర్..బీఎస్ఈకి సమాచారం అందించింది. జీఎంఆర్ విమానాశ్రయాల విలువ రూ. 18000 కోట్లుగా లెక్కకట్టారు. ఇప్పటికే టాటాలు దేశీయంగా రెండు ఎయిర్ లైన్స్‌లను నిర్వహిస్తున్నాయి. టాటాలతో పాటు బిలియనీర్ గౌతమ్ అంబానీ కూడా విమానయాన రంగంలో ఎంట్రీ ఇచ్చి గత నెలలో వేలం పాటలో పాల్గొని ఆరు విమానాశ్రయాలను దక్కించుకున్నారు.