TikTok బ్యాన్ : ఇండియాలో 100 కోట్ల పెట్టుబడికి మరో ప్లాన్
చైనాకు చెందిన బీజింగ్ బైట్ డ్యాన్స్ టెక్నాలజీ వచ్చే మూడేళ్లలో 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

చైనాకు చెందిన బీజింగ్ బైట్ డ్యాన్స్ టెక్నాలజీ వచ్చే మూడేళ్లలో 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
చైనాకు చెందిన బీజింగ్ బైట్ డ్యాన్స్ టెక్నాలజీ వచ్చే మూడేళ్లలో ఇండియాలో 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇటీవల ఇండియాలో చైనీస్ షార్ట్ వీడియో యాప్ TikTok బ్యాన్ చేసినప్పటికీ.. పేరెంట్ కంపెనీ ByteDance భారత్ లో భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది. బైట్ డ్యాన్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా విలువైన సాఫ్ట్ బ్యాంకు, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, సీక్వోయా స్టార్టప్ ఇన్వెస్టర్ల కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో హేలో, విగో వీడియో వంటి ప్లాట్ ఫాంలను ఆఫర్ చేస్తోంది.
Also Read : Voiceతోనే టైపింగ్ : వచ్చే ఐదేళ్లలో Keyboards ఉండవు
ఇటీవల టిక్ టాక్ యాప్ లో ఫొర్నోగ్రఫీ కంటెంట్ ఎక్కువగా వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా టిక్ టాక్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అసభ్యకరమైనరీతిలో వీడియోలు పోస్టులు చేసి భ్రష్టు పట్టిస్తున్నారని, దీనివల్ల చదువుకునే పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ లు వెల్లువెత్తాయి. మద్రాసు హైకోర్టు ఏప్రిల్ 3న జోక్యంతో కేంద్ర ప్రభుత్వం గూగుల్, ఆపిల్ స్టోర్లలో టిక్ టాక్ తొలగించాల్సిందిగా సూచించింది. దీంతో గూగుల్, ఆపిల్ కంపెనీలు తమ ప్లే స్టోర్ల నుంచి టిక్ టాక్ యాప్ ను అధికారికంగా తొలగించాయి. దీనిపై టిక్ టాక్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది.
ఇప్పటివరకూ ఇండియాలో TikTok App బ్యాన్ చేయడంపై మౌనం వహించిన బైట్ డ్యాన్స్ కంపెనీ.. దేశంలో తమ బిజినెస్ ను డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే మూడు ఏళ్లలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇండియన్ యూజర్లకు చేరువలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా బైట్ డ్యాన్స్ కంపెనీ (ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ) డైరెక్టర్ హెలెనా లెర్సెస్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా తమ ప్లాట్ ఫాంలో పబ్లీష్ అయ్యే కంటెంట్ కు సంబంధించి మోడరేషన్ పాలసీలను బలోపేతం చేస్తున్నట్టు ఆమె చెప్పారు.
ప్రస్తుత పరిణామాలపై తాము చింతిస్తున్నామని అన్నారు. అయినప్పటికీ ఆశావాదంతో ముందుకెళ్తామని చెప్పారు. ఇండియన్ యూజర్లకు కట్టుబడి ఉన్నామని, దేశంలో ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇండియాలో వచ్చే మూడేళ్లలో 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు హెలెనా తెలిపారు. ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతోందో చూడాలని అన్నారు. అంతేకాదు.. ఇండియాలో ఈ ఏడాది ఆఖరిలోగా వెయ్యి మంది వరకు తమ కంపెనీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నట్టు తెలిపారు. ఇండియాలో 12 కోట్లు (120 మిలియన్లు) మందికి పైగా టిక్ టాక్ యూజర్లు ఉన్నారు. వీరిలో యువత ఎక్కువ మంది ఉన్నారు.
Also Read : 240 క్రిమినల్ కేసులు : 4 పేజీల యాడ్ : బీజేపీ టికెట్ పై పోటీ