పర్సనల్ లోన్‌ తీసుకున్నారా? మీరు ఇలా చేస్తే త్వరగా రుణ భారం తగ్గుతుంది..

రుణ బదిలీకి కొంత ఛార్జ్ ఉండొచ్చు.

పర్సనల్ లోన్‌ తీసుకున్నారా? మీరు ఇలా చేస్తే త్వరగా రుణ భారం తగ్గుతుంది..

Updated On : May 31, 2025 / 8:54 AM IST

మనకు ఉన్నట్టుండి డబ్బులు అవసరమైతే వెంటనే పర్సనల్‌ లోన్‌ ఆప్షన్ గుర్తుకు వస్తుంది. పర్సనల్‌ లోన్లు ఈజీగానే తీసుకోవచ్చు. అయితే, వీలైనంత త్వరగా వాటిని తీర్చేస్తే వడ్డీల భారం తగ్గుతుంది. అప్పు తీరిపోయిందన్న మనశ్శాంతి కూడా కలుగుతుంది. పర్సనల్‌ లోన్‌ను త్వరగా తీర్చడానికీ, వడ్డీ భారం తగ్గించుకునేందుకు పాటించాల్సిన కొన్ని పద్ధతులను చూద్దాం..

నెలవారీ కట్టాల్సిన ఈఎంఐకి తోడుగా కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించడం ద్వారా రుణ కాలం తగ్గుతుంది. దీని వల్ల వడ్డీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల రుణానికి ప్రతి నెల రూ.2,000 అదనంగా చెల్లిస్తే, మీరు ఈఎంఐలు చెల్లించాల్సిన కాలం 5 ఏళ్ల నుంచి 3.5 ఏళ్లకు తగ్గుతుంది.

Also Read: ఒప్పో స్మార్ట్‌ఫోన్లంటే మీకు ఇష్టమా? తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ 2 ఫోన్లు అదుర్స్ అంతే..

అధిక వడ్డీకి తీసుకున్న రుణాన్ని తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకు బదిలీ చేయడం వల్ల ఈఎంఐ, వడ్డీ ఖర్చు రెండూ తగ్గుతాయి. అయితే, రుణ బదిలీకి కొంత ఛార్జ్ ఉండొచ్చు. ముందుగానే అన్ని ఖర్చుల గురించి తెలుసుకోవాలి.

మీ ఆఫీసులో బోనస్, పన్ను రీఫండ్, ఆస్తుల అమ్మకం ద్వారా మీకు ఉన్నట్టుండి ఒక్కోసారి ఆదాయం రావచ్చు. ఇటువంటి సమయాల్లో మీకు డబ్బు అందితే ఈ ఆదాయాన్ని రుణ అసలుకు జమ చేయండి. దీంతో వడ్డీ భారం తగ్గుతుంది.

చలన వడ్డీ రుణాలకు ముందస్తు చెల్లింపుపై సాధారణంగా ఎలాంటి రుసుములు ఉండవు. కానీ కొన్ని బ్యాంకులు పాక్షిక చెల్లింపులకు అనుమతించకపోవచ్చు.

క్రెడిట్ స్కోరు బాగుంటే రుణ రేటు తగ్గించే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించడం వల్ల స్కోరు మెరుగవుతుంది. బ్యాంకుతో మాట్లాడి వడ్డీ రేటు తగ్గించమని అభ్యర్థించవచ్చు. కొన్ని బ్యాంకులు స్కోరు బాగుంటే వడ్డీ తగ్గించేందుకు సిద్ధంగా ఉంటాయి.

ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి. ఖరీదైన వస్తువుల కొనుగోళ్ల జోలికి వెళ్లకండి. అప్పు అవసరమే రాకుండా జాగ్రత్తపడండి.