దేవుడా…యస్ బ్యాంకు నుంచి వెంకన్న రక్షించాడు

సంక్షోభంలో పడిన యస్ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ ఛైర్మన్ కొన్ని నెలల కిందటే బ్యాంకులో ఉన్న రూ.1300 కోట్ల డిపాజిట్లు ఉపంసహరించారు. యస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నసంగతి తెలిసిన TTD చైర్మన్ ముందు జాగ్రత్తగా డిపాజిట్లు వాపసు తీసుకున్నారు. RBI ఇప్పటికే YES BANK కు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. డిపాజిట్ దారులు 50వేల రూపాయలకు మించి విత్ డ్రా చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.
గత TDP ప్రభుత్వ హయాంలో యస్ బ్యాంకుతో సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లోకి టీటీడీ డిపాజిట్లు వేశారు. కానీ 2019లో ప్రభుత్వం మారి, వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టగానే డిపాజిట్ల వ్యవహారంపై దృష్టి పెట్టారు. నాలుగు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న టీటీడీ ఛైర్మన్… యస్ బ్యాంకు పరిస్థితులపై ప్రమాదకర ఘంటికలను గుర్తించారు. డిపాజిట్లను వెంటనే రద్దు చేసి నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
డిపాజిట్లు ఉపసంహరించుకోవద్దని ఆయనపై ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఖాతరు చేయకుండా రూ.1300 కోట్లు వెనక్కి రప్పించారు. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డికి సూచించారు. చివరకు యస్ బ్యాంకు నుంచి రూ.1300 కోట్లు డిపాజిట్లను టీటీడీ ఉపసంహరించుకుంది.
దేశంలోనే నాలుగో అతి పెద్ద ప్రయివేటు బ్యాంక్‌గా ఉన్న యస్ బ్యాంక్ సంస్థాగత సమస్యతో పాటు పెట్టుబడుల సమీకరణ ప్రతికూలతను ఎదుర్కొంటుంది. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ మాజీ కీలక ఎగ్జిక్యూటివ్ ఒక్కరు తన వాటాలను విక్రయించడంతో ఆ బ్యాంకుపై ఉన్న విశ్వాసం మరింత సన్నగిల్లడంతో డిపాజిట్ల ఉపసంహరణ భారీగా పెరిగిపోయిందని బ్లూమ్‌బర్గ్ ఓ కథనంలో పేర్కొంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్‌లో బ్యాంకు షేర్ కూడా భారీగా పడిపోతూ వస్తోం ది.
2019లో ఈ బ్యాంకుకు కొత్త సారథి వచ్చినప్ప టికీ నిధుల సమీకరణలో వెనుకబడిపోయింది. దీంతో ఆ బ్యాంక్ స్థిరత్వంపై అనేక ప్రశ్నలు ఉత్పనం అవుతున్నాయి. బ్యాంకు మొండి బాకీల ఆందోళనకు తోడు మూలధన సమీకరణలో ప్రతికూలతల లను ఎదుర్కొంటుం దని ఇండియా నివేష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు రవికాంత్ ఆనంద్ భట్ గతంలో పేర్కొన్నారు
కాగా… యస్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేసే కన్సార్షియంకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ నాయకత్వం వహించనుందని బ్లూం బర్గ్ నివేదించింది. దీనికి భారత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని పేర్కొంది. దీంతో గురువారం, మార్చి5, నాటి మార్కెట్‌లో యస్ బ్యాంకు షేర్లు 29 శాతం ర్యాలీ అయ్యాయి.
యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ఒక కన్సార్షియం ఏర్పాటుకు ఆమోదం లభించిందని కన్సార్షియంలో సభ్యులను ఎంపిక చేసేందుకు కూడా SBI గ్రీన్ సిగ్నల్ లభించిందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది.