ఒక్కరోజూ కాలేజీకి వెళ్లలేదు.. అయినా కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.10 కోట్లు సంపాదిస్తున్న విద్యార్థి

Deloitte: కేవలం ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతేనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం.

ఒక్కరోజూ కాలేజీకి వెళ్లలేదు.. అయినా కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.10 కోట్లు సంపాదిస్తున్న విద్యార్థి

Job

Updated On : April 14, 2024 / 4:53 PM IST

కాలేజీకి వెళ్లి చదువుకుంటేనే, అన్ని పరీక్షల్లో పాస్ అయితేనే జీవితంలో ఎదుగుతామని, గొప్పవాళ్లం అవుతామని చాలా మంది భావిస్తుంటారు. కేవలం ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతేనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం.

టాలెంట్ అంటే చదువేనని, విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించకపోతే ఎందులోనూ రాణించలేమని విద్యార్థులు అనుకుంటారు. టాలెంట్ ఉంటే ఎదగడానికి ఏదీ అడ్డంకాదని చాలా మంది నిరూపిస్తున్నప్పటికీ ఇంటర్ విద్యార్థులు మార్కుల మీదే దృష్టిపెడుతూ, మంచి స్కోరు రాకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

Ben Newton

ఇలాంటి మానసికస్థితి యూకేకు చెందిన బెన్ న్యూటన్ (30)కి మాత్రం లేదు. ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్లకపోయినా, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు బోధించే చదువు బుర్రలోకి ఎక్కించుకోకలేకపోయినా అతి పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అంతేకాదు, ఏడాదికి రూ.10 కోట్లు సంపాదిస్తున్నాడు.

బ్రిటిష్ మల్టీనేషనల్ ప్రొఫెషనల్ సర్వీస్ నెట్‌వర్క్ డెలాయిట్‌లో పార్ట్నర్‌గా, క్వాలిఫైడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అతడి యావరేజ్ పే మిలిన్ పౌండ్లు (రూ.10 కోట్లు). డెలాయిట్ కంపెనీలో అతడి ప్రస్థానం 12 ఏళ్ల క్రితం మొదలైంది. 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అతడు డెలాయిట్ బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ లో చేరాడు.

గత ఏడాది కంపెనీ ఫార్ట్నర్ గా మారాడు. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ నుంచి ఒక స్కూల్ డ్రాపౌట్ పార్ట్నర్ కావడం ఆ కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. బెన్ న్యూటన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను డోర్సెట్‌లో పెరిగానని, తన తండ్రి 16 సంవత్సరాల వయస్సులో బడి చదువు విడిచి సైన్యంలో చేరారని తెలిపాడు.

తన తల్లి పబ్‌లో పనిచేసేదని చెప్పాడు. ఆ తర్వాత ట్రావెల్ ఏజెంట్‌గా చేసిందని అన్నాడు. నిజానికి బెన్ న్యూటన్ కు ఓ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్ కోర్సులో చేరడానికి సీటు దక్కింది. అతడి కుటుంబంలో విశ్వవిద్యాలయంలో చదువుకున్నవారు ఎవరూ లేరు. వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి సీట్ వచ్చాక కాలేజీలో చేరకుండా డెలాయిట్ బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ లో చేరాడు.

వృత్తిపర జీవితాన్ని త్వరగా ప్రారంభిస్తే, తొందరగా డబ్బు సంపాదించవచ్చని భావించాడు. ఇప్పుడు న్యూటన్ ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. క్వాలిఫైడ్ అకౌంటెంట్ అయ్యాడు. తాను విశ్వవిద్యాలయంలో చదివినా కూడా ఇదే జాబ్ వస్తుందని భావించి, 12 ఏళ్ల క్రితం డెలాయిట్ బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ లో చేరానని అన్నాడు. ఎప్పుడూ నేర్చుకోవడాన్ని తాను ఇష్టపడతానని తెలిపాడు.

Also Read : గూగుల్ పిక్సెల్ 8ఎ సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, కలర్ ఆప్షన్లు లీక్..!