Union Budget 2026 : ఫిబ్రవరి 1నే బడ్జెట్.. గతంలో కేంద్ర బడ్జెట్ ఆదివారం ఎన్నిసార్లు సమర్పించారో తెలుసా? దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్..!
Union Budget 2026: భారత్‌లో తొలిసారిగా ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1, 2026 బడ్జెట్ చరిత్రలోనే చారిత్రాత్మక మార్పుగా చెప్పవచ్చు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2026
- ఆదివారం రోజు వార్షిక బడ్జెట్ 2026 సమర్పణ
- ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో 2026–27 కేంద్ర బడ్జెట్
- 2016 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి 28న సమర్పించేవారు
- ఫిబ్రవరి 1, 2026 ఆదివారం రోజు అయినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది
Union Budget 2026 : స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2026ను ఆదివారం రోజు సమర్పించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత పార్లమెంటరీ క్యాలెండర్‌లోనే చరిత్ర సృష్టించనుంది. బడ్జెట్ ఎక్కువగా వారాంతంలో ఉండేది. అప్పుడప్పుడు శనివారాల్లో కూడా బడ్జెట్ నిర్వహించేవారు. కానీ, ఆదివారం బడ్జెట్ అనేది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు.
ఆదివారం ఎన్నిసార్లు బడ్జెట్ సమర్పించారంటే? :
స్వతంత్ర భారత్‌లో ఫస్ట్ టైమ్ ఆదివారం కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. దశాబ్దాలుగా, అనేక ప్రభుత్వాలు ఆదివారాల్లో బడ్జెట్ ప్రారంభించలేదు. 2016 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి 28న సమర్పించేవారు. అప్పటినుంచి వారాంతంలో రాకుండా చూసుకునేవారు. బడ్జెట్ తేదీని మార్చిన తర్వాత కూడా ఇప్పటివరకు బడ్జెట్ రోజును ఆదివారంగా మార్చలేదు.
2026 బడ్జెట్ ఆదివారమే ఎందుకంటే? :
దీనికి కారణం.. 2017లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సంస్కరణ. ఆ సమయంలో ప్రభుత్వం ఫిబ్రవరి 1ని కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు ముఖ్యమైన తేదీగా నిర్ణయించింది. ఈ మార్పుకు ముందు ఆర్థిక మంత్రి ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ముందు ఖర్చులను ప్లాన్ చేయడంతో పాటు అమలు చేసేందుకు మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలకు మరింత సమయం ఇవ్వొచ్చు. ఈసారి ఫిబ్రవరి 1, 2026 ఆదివారం రోజు అయినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
గతంలో వీకెండ్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారా? :
గతంలో వీకెండ్ లో కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేవారు.. కానీ, అది కానీ శనివారాల్లో మాత్రమే జరిగింది. ఆదివారాల్లో ఎప్పుడూ అలా జరగలేదు. ఇటీవలి ఏళ్లలో 2015, 2020, 2025 సంవత్సరాల్లో బడ్జెట్ ప్రజెంటేషన్లు శనివారాల్లో జరిగాయి. మినహాయింపులు మాత్రమే కానీ నియమం కాదు. అయినప్పటికీ, ప్రభుత్వాలు మార్కెట్, పరిపాలనా ప్రక్రియల కోసం వీకెండ్ లో బడ్జెట్ ప్రవేశపెట్టాయి.
2026 బడ్జెట్ కోసం, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండూ ఫిబ్రవరి 1న స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్లను నిర్వహిస్తాయి. ఆర్థిక వ్యవస్థలు మారుతున్న కాలక్రమాలకు ఎలా అనుగుణంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
సాయంత్రం 5 గంటలకే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టేవారు? :
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు 5 దశాబ్దాలుగా భారత్‌లో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించి బ్రిటీష్ వారసత్వాన్ని అనుసరించింది. ఆ తర్వాత రోజుల్లో స్వస్తి పలికింది.
ఈ సమయానికి భారతీయుల సౌలభ్యంతో సంబంధం లేదు. దేశంలో సాయంత్రం అయినప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో ఉదయం అయ్యేది. దాంతో బ్రిటిష్ అధికారులు ఆర్థిక పరిణామాలను రియల్ టైమ్ ట్రాక్ చేసేందుకు వీలుండేది.
వలస పాలన ముగిసిన చాలా కాలం తర్వాత కూడా 1990ల చివరి వరకు ఈ ఆచారం కొనసాగింది. బడ్జెట్ సమర్పణను ఉదయం 11 గంటలకు మార్చడం ద్వారా భారత్ చివరకు ఈ వలస సంప్రదాయం నుంచి బయటపడింది. వలసవాద వారసత్వాలకు బదులుగా దేశీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
వరుసగా 9వసారి బడ్జెట్ :
కేంద్ర బడ్జెట్ 2026 నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. భారత రాజకీయ చరిత్రలో అరుదైన మైలురాయి. మరే ఇతర ఆర్థిక మంత్రి కూడా ఇన్ని వరుస పూర్తి బడ్జెట్లను ప్రవేశపెట్టలేదు. ఆదివారం ప్రెజెంటేషన్ ఆమె పదవీకాలానికి మరో ప్రత్యేకమైన అధ్యాయంగా చెప్పొచ్చు. బడ్జెట్ 2026ను విధానపరమైన సంస్కరణలతో ఉంటుంది.
వచ్చే బడ్జెట్లో ఏయే ప్రకటనలు ఉండొచ్చు? :
మౌలిక సదుపాయాలు, రైల్వేలు, తయారీ, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, ఎంఎస్ఎంఈలు, ఎలక్ట్రానిక్స్, పట్టణాభివృద్ధి, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి కీలక రంగాలలో లక్ష్య కేటాయింపుల ద్వారా భారత వృద్ధి వేగాన్ని నిలబెట్టడంపై బడ్జెట్ 2026 దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు.
ప్రపంచ అనిశ్చితి, దేశీయ వృద్ధి ప్రాధాన్యతలతో బడ్జెట్ సమయం, అదనపు ప్రాముఖ్యతను అందించనుంది. ఆదివారం బడ్జెట్ 2026 సమర్పణ భారత పాలన వలస పాలన నుంచి ఎలా మారిందో తెలియజేస్తుంది.
