G20 Agriculture Ministers Meet: హైదరాబాద్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి… వ్యవసాయ సహకారంపై ధనుకాకు ప్రశంసలు

G-20 యొక్క అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రుల 3-రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఇందులో సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

G20 Agriculture Ministers Meet: హైదరాబాద్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి… వ్యవసాయ సహకారంపై ధనుకాకు ప్రశంసలు

Updated On : June 18, 2023 / 7:36 PM IST

Narendra Singh Tomar: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హైదరాబాద్‌లో జరుగిన G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ స్టాల్‌ను సందర్శించారు. వ్యవసాయ రంగానికి గ్రూప్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. స్టాల్‌ను సందర్శించిన సందర్భంగా గ్రూప్ చైర్మన్ అగర్వాల్‌తో వ్యవసాయ రంగంలో వివిధ అవకాశాలు, వ్యవసాయ రసాయన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సంభాషించారు.

Heart of Stone trailer : హాలీవుడ్ మూవీలో విల‌న్‌గా అలియా.. తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

ఈ ఎగ్జిబిషన్‭లో భాగంగా కంపెనీ తన వినూత్న ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డ్రోన్ టెక్నాలజీలు, వ్యవసాయం, అనుబంధ రంగాలలో సాధించిన విజయాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. G-20 యొక్క అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రుల 3-రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఇందులో సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

Crime News: రూ.10 వేల అప్పు తిరిగి చెల్లించలేదని.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కాల్చి చంపిన వడ్డీ వ్యాపారి, అతడి అనుచరులు

ఈ సందర్భంగా ధనుకా గ్రూప్ చైర్మన్ అగర్వాల్ మాట్లాడుతూ “G20 అగ్రికల్చర్ మినిస్టీరియల్ మీటింగ్‌లో ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ పాల్గొనడం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ వాటాదారులతో కలిసి పనిచేయడానికి మా నిబద్ధతను తెలియజేస్తోంది. ధనుకా వద్ద మేము రైతులతో సహా వివిధ వాటాదారులకు మా నైపుణ్యం, వినూత్న పరిష్కారాలను పంచుకోవడం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయం, ఆహార భద్రత అభివృద్ధికి తోడ్పడేందుకు కృషి చేస్తున్నాము” అని అన్నారు.