Vodafone Idea : వోడాఫోన్ యూజర్లకు అదిరే ఆఫర్.. ‘విఐ గ్యారెంటీ ప్రోగ్రామ్’తో అదనపు 130జీబీ డేటాను పొందొచ్చు!

Vodafone Idea : ఈ అదనపు డేటా ఆఫర్‌ను పొందాలంటే విఐ యూజర్లు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌లో ఉండాలి. యూజర్ వారి ప్రస్తుత డేటా కోటాలు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ డేటాను ఉపయోగించగలరు.

Vodafone Idea : వోడాఫోన్ యూజర్లకు అదిరే ఆఫర్.. ‘విఐ గ్యారెంటీ ప్రోగ్రామ్’తో అదనపు 130జీబీ డేటాను పొందొచ్చు!

Vodafone Idea offers extra 130GB data to 4G and 5G smartphone users ( Image Credit : Google )

Vodafone Idea : ప్రముఖ దేశీయ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల కోసం లిమిటెడ్ కాల ఆఫర్ అయిన ‘విఐ గ్యారెంటీ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త చొరవతో 5జీ, కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికి అంతరాయం లేని హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. విఐ గ్యారెంటీ ప్రోగ్రామ్ కింద విఐ వినియోగదారులు ఒక ఏడాది వ్యవధిలో 130జీబీ అదనపు డేటాను పొందవచ్చు.

Read Also : Samsung Galaxy F55 5G Launch : వేగన్ లెదర్ ఫినిష్‌తో శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్, ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

13 వరుస సైకిళ్లకు ప్రతి 28వ రోజు ఆటోమాటిక్‌గా 10జీబీ డేటా వారి అకౌంట్లలో యాడ్ అవుతుంది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ.. ‘నేటి డిజిటల్ ప్రపంచంలో వినియోగదారులకు కనెక్ట్ అవ్వడానికి ఉత్పాదకంగా వినోదభరితంగా ఉండటానికి ఎక్కువ డేటా అవసరం. వినియోగదారులకు నిరంతరాయంగా అందించడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి ‘విఐ గ్యారెంటీ’ ప్రోగ్రామ్ రూపొందించింది’ అని పేర్కొన్నారు.

విఐ గ్యారెంటీ ప్రోగ్రామ్‌ను ఎలా పొందాలి? :
ఈ అదనపు డేటా ఆఫర్‌ను పొందాలంటే విఐ యూజర్లు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌లో ఉండాలి. యూజర్ వారి ప్రస్తుత డేటా కోటాలు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ అదనపు డేటాను ఉపయోగించగలరు. ఈ ఆఫర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగిన విఐ సబ్‌స్క్రైబర్‌లకు లేదా ఇటీవల కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసిన వారికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. హామీ ఇచ్చిన డేటా ప్రయోజనాన్ని పొందడం లేదా అర్హత కలిగిన కస్టమర్‌లు 121199 లేదా *199*199#కి డయల్ చేయవచ్చు.

విఐ గ్యారెంటీ ఆఫర్.. ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, నార్త్ ఈస్ట్, ఒరిస్సా మినహా భారత్‌లో 5జీ, కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. భారత్‌లో చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తగినంత డేటా లేకపోవడం వల్ల 4జీ/5జీ మొబైల్ ఫోన్ల సామర్థ్యాన్ని పెంచుకోలేరు. ఈ ఆఫర్‌తో యూజర్లు వారి రోజువారీ కోటా అయిపోయిన తర్వాత కూడా వారి విఐ గ్యారెంటీ కోటాలోని డేటా వాడకంతో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా నచ్చిన కంటెంట్‌ను పొందవచ్చు.

Read Also : Reliance Jio Ghana : ఆఫ్రికా టెలికం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ? ఘనా ఎన్‌జీఐసీతో డీల్..!