కండిషన్స్ అప్లై: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్
టెలికం రంగంలో పోటీ వాతావరణం రోజురోజుకీ పెరిగిపోతోంది. టెలికం ఆపరేటర్లు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నారు.

టెలికం రంగంలో పోటీ వాతావరణం రోజురోజుకీ పెరిగిపోతోంది. టెలికం ఆపరేటర్లు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నారు.
టెలికం రంగంలో పోటీ వాతావరణం రోజురోజుకీ పెరిగిపోతోంది. టెలికం ఆపరేటర్లు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నారు. టెలికం మార్కెట్లలో రిలయన్స్ జియో రాకతో టెలికం ఆపరేటర్లలో మరింత పోటీ పెరిగింది. నువ్వానేనా అన్నట్టు పోటాపోటీగా ఆఫర్లు అందిస్తున్నాయి. ఇప్పటికే ఐడియా, ఎయిర్ టెల్ తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్ లతో ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం వోడాఫోన్ ఇండియా కూడా మరో కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. వోడాఫోన్ తమ యూజర్ల కోసం రూ.119 రీఛార్జ్ కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఈ రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. అన్ లిమిటెడ్ కాలింగ్, డెయిలీ 1జీబీ డేటాను 28 రోజుల కాలపరిమితిపై పొందొచ్చు. ముఖ్య గమనిక. వోడాఫోన్ అందించే ఈ కొత్త రూ.119 రీఛార్జ్ ప్లాన్ దేశవ్యాప్తంగా వర్తించదు. లిమిటెడ్ సర్కిళ్లలోనే ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
వోడాఫోన్ ఇండియా ఇటీవలే రూ.169 ప్లాన్ పై 1జీబీ డేటా అందిస్తోండగా.. 100 ఎస్ఎంఎస్ లు, 28 రోజుల వ్యాలిడెటీ ఉంటుంది. వోడాఫోన్ ప్లే యాప్ కు యాక్సిస్ పొందే వీలుంది. కానీ, వోడాఫోన్ కొత్త రీఛార్జ్ రూ.119 ప్లాన్ తప్ప.. రూ.169 ప్లాన్ మాత్రమే ఓపెన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వోడాఫోన్ 119 రీఛార్జ్ ప్లాన్ 4జీ సర్కిళ్లలో మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. వోడాఫోన్ అందిస్తోన్న రూ.119 రీఛార్జ్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ సర్కిళ్లలోని ఐడియా సెల్యూలర్ కస్టమర్లకు అందుబాటులో ఉంది.
గత ఏడాది 2018లో వోడాఫోన్ ఇండియా తమ కస్టమర్ల కోసం అన్ లిమిటెడ్ బెనిఫెట్స్ పై రూ.169 రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. అప్పుడే ఎయిర్ టెల్ కూడా రూ.169 రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో రూ.149 ప్లాన్ ప్రవేశపెట్టగా.. ఇందులో రోజుకు 100 SMS, 1జీబీ డేటా (28days) ఎలాంటి FUP limit లేకుండానే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ జియో అందించింది. జియోకు పోటీగా వోడాఫోన్ రూ.169 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.
Read Also: టాక్ టైమ్ ఈజ్ బ్యాక్ : వోడాఫోన్ 3 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
Read Also: ఓపిక పట్టండీ : 3 నెలల్లో భారీగా తగ్గనున్న DTH ఛానళ్ల ధరలు
Read Also: జియో ఆస్తులు అమ్ముతున్న అంబానీ