Yes Bank సంక్షోభం: పెట్రోల్ బంకుల్లో డబ్బులు ఖాళీ

Yes Bank సంక్షోభం: పెట్రోల్ బంకుల్లో డబ్బులు ఖాళీ

Updated On : March 8, 2020 / 8:42 AM IST

పెట్రోల్ పంపు ఓనర్లు లబోదిబోమంటున్నారు. యస్ బ్యాంక్ సంక్షోభం.. చేతిలో డబ్బుల్లేకుండా చేశాయంటున్నారు. ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన డబ్బులు యస్ బ్యాంకులోనే ఉండడంతో దిక్కుతోచని పరిస్థితి. గురువారం యస్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మారటోరియం విధించింది. అదే బ్యాంకు నుంచి రోజుకు రూ.30-40లక్షలు నగదు ఆయిల్ కంపెనీలకు చెల్లించేవారు.  బ్యాంకు సంక్షోభం కారణంగా 4-5రోజుల నుంచి పెట్రోల్ పంప్ ఓనర్ల బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. 

ప్రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీ డీలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. 15పెట్రోల్ పంపు ఓనర్లు కేవలం యస్ బ్యాంక్‌పైనే ఆధారపడి ఉన్నారు. 2015నుంచి వీరు రెండో బ్యాంకు వైపుకే పోలేదు. పెట్రోల్ పంపుల్లో బంచ్ నోట్ యాక్సప్టర్ మెషీన్లు బ్యాంకు స్పాన్సర్ చేసింది. భారీ స్థాయిలో నోట్ల కట్టలను మార్పిడి చేయడానికి వీలుండటంతో అంతా యస్ బ్యాంకునే ఫాలో అయ్యారు. క్రమంగా బ్యాంకు వృద్ధి చెందడంతో ఇతర బ్యాంకుల నుంచి కూడా అకౌంట్లు తరలించారు. 

దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో అయిదో స్థానంలో ఉండి సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మారటోరియం విధించింది. దీనితో పాటు.. వినియోగదారులు రూ. 50వేలకు మించి నగదు విత్‌డ్రా చేయకుండా పరిమితి విధించటం.. కస్టమర్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.  

ఈ ప్రకటన రావటానికి ఒక రోజు ముందు అంటే బుధవారం నాడే (మార్చి4న) గుజరాత్ కు చెందిన ఒక సంస్ధ యస్ బ్యాంకు నుంచి రూ. 265 కోట్ల రూపాయలను విత్ డ్రా చేసుకుని ఒడ్డున పడింది. వడోదర మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన (విఎంసీ)… వడోదర స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కంపెనీకి యస్ బ్యాంకు లో ఖాతా ఉంది. స్మార్ట్ సిటీ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆ బ్యాంకు లోనే జమ అయ్యేవి.