PhonePe యూజర్లకు UPI కష్టాలు.. 40% మందికి పనిచేయడం లేదు!

Phone Pay
ఫోన్‌పే యూజర్ల కష్టాలు తప్పెటట్టు లేవు. యస్ బ్యాంకు సంక్షోభం కారణంగా ఫోన్ పే యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి యూపీఐ పేమెంట్స్ విషయంలో పెద్ద సమస్యగా మారిపోయింది. అకౌంట్లలో నగదు ఎలా తీసుకోవాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకుపై భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
ఈ బ్యాంకు భాగస్వామ్యం కలిగిన ఫోన్ పేపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటి నుంచి ఫోన్ పే యూజర్లు.. యస్ బ్యాంకు కస్టమర్లతో పాటు క్యాష్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా యూపీఐ పేమెంట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాదు.. దేశంలోని ఫో్న్ పే ద్వారా జరిగే పలు బ్యాంకుల బల్క్ డిజిటల్ ట్రాన్సాక్షన్నీ స్తంభించిపోయాయి. యూపీఐ ట్రాన్సాక్షన్లు కూడా 40 శాతం మేర పడిపోయాయి. సాధారణంగా ఒక రోజులో ఫోన్ పే ద్వారా 20 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరుగుతుంటాయి. ఈ సంక్షోభంతో 40 శాతం మంది యూజర్లకు ఫోన్ పే పనిచేయడం లేదు.
యస్ బ్యాంకు సంక్షోభంతో ఫోన్ ఫే ట్రాన్సాక్షన్లు క్షీణించాయి. యస్ బ్యాంకు నుంచి లావాదేవీలు నిలిచిపోవడంతో యూపీఐ ఆధారిత పేమెంట్స్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పీర్ టూ పీర్ పేమెంట్స్, ఆన్ లైన్ మర్చంట్ పేమెంట్స్, ఇన్ స్టోర్ QR కోడ్ ఆధారిత పేమెంట్స్ సర్వీసులపై కూడా ప్రభావం పడింది. గత శుక్రవారం రాత్రే ఫోన్ ఫే ప్రతినిధి ఒకరు.. పీర్-టూ-పీర్ యూపీఐ ట్రాన్సాక్షన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. నేషనల్ పేమెంట్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫోన్ పే ను ICICI బ్యాంకుకు మారేందుకు అనుమతినిచ్చింది.
ఈ క్రమంలో యూజర్ల యూపీఐ ఐడీలను మైగ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కస్టమర్లు యూపీఐ ఐడీని మరో బ్యాంకుకు మార్చుకోవడమనేది చాలా కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో మర్చంట్ పేమెంట్స్ యూజర్లను కూడా మైగ్రేట్ అయ్యేలా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. దేశంలో గత జనవరిలో యస్ బ్యాంకు 39 శాతంతో 1.3 బిలియన్ల యూపీఐ లావాదేవీలను పూర్తి చేసింది. తద్వారా ఫోన్ పే ద్వారా 570 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. అందులో ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్లే ఎక్కువగా ఉన్నాయి.
See Also | మార్చి 10న జాబ్‌మేళా..మహిళలకు మాత్రమే