జొమోటో నుండి 5వేల రెస్టారెంట్లు ఔట్

ప్రముఖ ఫుడ్ సరఫరా కంపెనీ జొమోటో.. ఐదు వేల రెస్టారెంట్లను ఫిబ్రవరిలో తమ లిస్ట్ నుండి తొలిగించినట్లు ప్రకటించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(Food Safety and Standards Authority of India) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని జొమోటో ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకున్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Read Also: Flying Taxi: భవిష్యత్ రవాణా మొత్తం గాల్లోనే..
ఈ సంధర్భంగా.. నిత్యం మా జాబితాలోకి కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చి చేరుతున్నాయని జొమాటో సీఈవో మోహిత్ గుప్తా చెప్పారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం మాకు కీలకంగా మారిందని, మాతో అనుబంధం ఉన్న దాదాపు 80,000 రెస్టారెంట్లను మరోసారి పరిశీలించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలను అందుకొనేందుకు సాయం చేస్తామని వెల్లడించారు.