మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి, లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళతో చనువుగా ఉంటూ ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆటోడ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
జిల్లాలోని వేమనపల్లి మండలంం సూరారం గ్రామానికి చెందిన రస్ పెల్లి మధు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి భార్యతో పరిచయం పెంచుకున్నాడు.
ఆమెతో చనువుగా ఉంటూ కొద్ది రోజుల క్రితం ఆమె బాత్ రూం లో స్నానం చేస్తుండగా చాటుగా వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియో క్లిప్పింగు ను అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. తన కోరిక తీర్చమని లేకపోతే వీడియో అందరికీ పంపిస్తానని చెప్పి వివాహితను శారీరకంగా లొంగ దీసుకున్నాడు.
దీంతో ఆమె అతడి లైంగిక కోర్కెలు తీర్చింది. ఇది అలుసుగా తీసుకుని మధు ఆమెను అనేక సార్లు బెదిరించి లైంగిక దాడి చేశాడు. అయినప్పటికీ ఇటీవల అతను ఆ వీడియోను వాట్సప్ గ్రూప్ లో షేర్ చేయటంతో బాధితురాలు విషయాన్ని భర్తకు చెప్పింది. వారిద్దరూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటోడ్రైవర్ ను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.