కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం…. ఐదుగురు మృతి

  • Published By: murthy ,Published On : November 27, 2020 / 10:48 AM IST
కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం…. ఐదుగురు మృతి

Updated On : November 27, 2020 / 11:21 AM IST

Fire breaks out at ICU of COVID hospital Gujarat’s Rajkot, 5 dead: గుజరాత్ లోని రాజ్ కోట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ కేర్ సెంటర్ లో శుక్రవారం తెల్లవారు ఝూమున జరిగిని అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 6 గురు గాయపడ్డారు.

రాజ్ కోట్ లోని శివానంద్ కోవిడ్ ఆసుపత్రిలో మొత్తం 35 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వారిలో 11 మంది ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి రోగులందరినీ వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభివించినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.



ఐసీయూలోని వెంటిలేటర్ లో ఒక స్పార్క్ వచ్చిందని అక్కడి నుంచి మంటలు వ్యాపించినట్లుగా ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయమని సీఎం విజయ్ రూపాని ఆదేశించారు.
https://10tv.in/rip-madonna-trends-online-after-twitter-users-mistake-her-for-maradona/
శుక్రవారం తెల్లవారు ఝూమున 1 గంట ప్రాంతంలో మావ్డి ప్రాంతంలోని శివానంద్ ఆస్పత్రిలోమంటలు చెలరేగినట్లు సమాచారం వచ్చిందని, వెంటనే సిబ్బందితో ఘటనా స్ధలానికి వెళ్లి కోవిడ్ పేషెంట్లను రక్షించినట్లు అగ్నిమాపకదళ అధికారి జెబిథెవా తెలిపారు.