మామ…కోడలు రాసలీలలు…..విషయం తెలిసిన కొడుకు…

ఇంటి కొచ్చిన కోడలితో, మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో శృంగారం జరిపాడు. మొగుడుతోనూ,మామ తోనే సుఖాన్ని పొందుతున్న భార్య అందుకు అభ్యంతరం చెప్పలేదు. గుట్టుగా ఇద్దరితోనూ మెలుగుతోంది. భార్య అక్రమ సంబంధం తెలిసిన భర్త, ఒకరి తర్వాత ఒకరిని ఇద్దరినీ హత్య చేశాడు.
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మల కుంట లో నివసించే లూనావత్ స్వామి , భార్య సరోజ(36)తో కాపురం ఉంటున్నాడు. సరోజ, స్వామి తండ్రి…బీక్యా తో లైంగిక సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో మామతో రాసలీలలు సాగించేది. కొన్నాళ్ళకు వారిద్దరి అక్రమ సంబంధం కనిపెట్టిన స్వామి కోపంతో రగిలి పోయాడు.
కూతురులాంటి కోడలితో తండ్రి శారీరక సంబంధం పెట్టుకోవటం తట్టుకోలేక పోయాడు. కన్నతండ్రి అని కూడా చూడకుండా హత్య చేసి జైలు కెళ్లాడు. నాలుగు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే వావి వరసలు మరిచి తండ్రిలాంటి మామతో బరి తెగించి లైంగిక సంబంధం పెట్టుకున్న భార్యపైనా కక్ష పెంచుకున్నాడు.
వారం రోజుల క్రితం స్వామి బెయిల్ పై బయటకు వచ్చాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లి భార్య సరోజను గొడ్డలితో దారుణంగా నరికి చంపేశాడు. కొన ఊపిరితో ఉన్న సరోజను చుట్టుపక్కల వారు ప్రయివేటు ఆస్పత్రికి తరలించగాఅక్కడ చికిత్స పొందుతూ మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.