భార్య కాపురానికి రావట్లేదని భర్త అఘాయిత్యం

  • Published By: murthy ,Published On : November 14, 2020 / 05:16 PM IST
భార్య కాపురానికి రావట్లేదని భర్త అఘాయిత్యం

Updated On : November 14, 2020 / 5:54 PM IST

man attempts suicide due to family disputes : గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావట్లేదని,ఒక భర్త గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. పాతబస్తీ భవానీ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో నివాసం ఉండే ఆటో డ్రైవర్ శబజ్ కు, భవానీ నగర్ కు చెందిన బేగంతో ఏడాది క్రితం వివాహం జరిగింది. శబజ్ కు ఇది రెండవ వివాహం.

ప్రతిరోజు మద్యం, వైటనర్ సేవించి వచ్చి భార్యను కొట్టి, చిత్రహింసలకు గురిచేసేవాడు. భర్త వేధింపులు భరించలేని బేగం ఇటీవల మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి పుట్టింటికి చేరుకుంది. ఈక్రమంలో శనివారు ఉదయం అత్తారింటికి వచ్చిన శబజ్ భార్యను ఇంటికి రావాలని కోరాడు. ఆమె అందుకు నిరాకరించింది. దీంతో వారిద్దరూ గొడవ పడ్డారు.


గొడవ జరిగినప్పటికీ ఆమె భర్తతో వెళ్లటానికి నిరాకరించింది. ఆమె రాక పోయే సరికి శబజ్ బ్లేడు తో గొంతు కోసుకున్నాడు. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.