వివాహేతర సంబంధం…ప్రియురాలితో ఉండగా వచ్చిన భర్త

Man killed over illegal affair, by husband : నిజామాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పట్టణంలోని నాగారంలో నివాసం ఉండే సాల్మన్ రాజు అనే వ్యక్తి (21) ఆర్యనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఏడాది కాలంగా ప్లంబర్ వర్క్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో అపార్ట్ మెంట్ పక్కనే నివాసం ఉంటున్న వివాహిత మహిళతో రాజుకు పరిచయం ఏర్పడింది.వారిద్దరి పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. మహిళ భర్త ఉమాకాంత్ అక్కడకు సమీపంలోని కల్లు దుకాణంలో వాచ్ మెన్ గా పని చేస్తుంటాడు.
ఉమాకాంత్ ఇంట్లో లేని సమయంలో రాజు ఆమె వద్దకు వచ్చి సన్నిహితంగా మెలిగేవాడు. శనివారం రాత్రి కూడా రాజు ఆమె ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి వారిద్దరూ సన్నిహితంగా ఉన్నసమయంలో ఉమాకాంత్ ఇంటికి వచ్చాడు. రాజుతో తన భార్య సన్నిహితంగా ఉండటం చూసిన ఉమాకాంత్ కోపంతో రగిలిపోయాడు.
ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో సాల్మన్ రాజు తలపై బలంగా కొట్టాడు. ఉమాకాంత్ కొట్టిన దెబ్బలకు సాల్మన్ రాజు అక్కడి కక్కడే ప్రాణం విడిచాడు. సమాచారం తెలుసుకున్న నాలుగో టౌన్ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని…..మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ఉమా కాంత్ ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.