17 ఏళ్ళ బాలికపై అత్యాచారం, హత్య : యూపీలో దారుణం, 10 రోజుల్లో 2 సంఘటనలు

  • Published By: murthy ,Published On : August 26, 2020 / 02:16 PM IST
17 ఏళ్ళ బాలికపై అత్యాచారం, హత్య : యూపీలో దారుణం, 10 రోజుల్లో 2 సంఘటనలు

Updated On : August 26, 2020 / 3:05 PM IST

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఇద్దరు మైనర్ బాలికలు హత్యాచారానికి గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్దితి క్షీణించాయని ఇటీవల మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రలో మహిళలు,మైనర్ బాలికలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు ఎక్కువైపోయాయి.



10 రోజుల వ్యవధిలో 17 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. స్కాలర్ షిప్ ఫారంనింపటానికి వెళ్లిన బాలిక విగతజీవిగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలోని ఖేరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 17 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని ఎండిపోయిన చెరువులో పోలీసులు మంగళవారం ఆగస్ట్ 25న కనుగొన్నారు.

ఆగస్ట్ 24వ తేదీ సోమవారం ఉదయం 8-30గంటలకు ఆ బాలిక స్కాలర్ షిప్ ఫారం నింపటానికి సమీపంలోని పట్టణానికి వెళ్లింది. రాత్రి గడిచినా ఇంటికి తిరిగి రాకపోవటంతో తల్లితండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా ఆమె మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని చెరువులో కనుగొన్నారు.



కుటుంబ సభ్యులు హత్యపై ఎవరిపైనా వారు అనుమానం వ్యక్తం చేయలేకపోయారు. పోస్టుమార్టం నివేదికలో బాలికపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. పదునైన ఆయుధంతో బాలిక మెడ కోసి చంపబడినట్లు గుర్తించారు. లభించిన ఆధారాలను బట్టి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
https://10tv.in/women-gang-raped-nizamabad/
కాగా 10 రోజుల్లో టీనేజ్ బాలికలపై జరిగిన రెండవ హత్య ఇది. లక్నో కు 130 కిలో మీటర్ల దూరంలోని నేపాల్ కు సరిహద్దుల్లో ఉన్న గ్రామంలో ఆగస్టు 15న 13 ఏళ్ళ బాలిక కూడా హత్యాచారానికి గురై మరణించింది. ఆగస్ట్ 14మధ్యాహ్నం బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది.



ఆమె మృతదేహాం అనుమానిత నిందితుల్లో ఒకరికి చెందిన చెరుకు పొలంలో లభించింది. ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బాలికపై అత్యాచారం చేసి, నాలుక గొంతు కోసి హత్యచేసినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కేసు విచారణ కొనసాగుతోంది.