పెళ్లికాకుండానే పుట్టిన బిడ్డ..రూ.60 వేలకు అమ్మేసి..అత్యాచారం కేసు పెట్టిన యువతి

ఓ యువతి పెళ్లికాకుండానే గర్భవతి అయ్యింది. పండంటి బిడ్డను కూడా కన్నది. పెళ్లికాకుండా గర్భవతి అయ్యి..బిడ్డను కన్న ఆమె ధైర్యవంతురాలు కాదు స్వార్థపరురాలని తేలింది. తన స్వార్థం కోసం కన్నబిడ్డను రూ.60వేలకు అమ్మేసింది. అంతటితో ఊరుకోకుండా తనకు గర్భం రావటానికి కారణమైన వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టి ఇరుక్కుపోయింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఈ యువతి ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నేరేడ్ మెట్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ యువతి పెళ్లికాకుండానే గర్భవతి అయ్యింది. బిడ్డను కూడా ప్రసవించింది. తరువాత బిడ్డ పుట్టిన 10 రోజులకే ఆ చిన్నారిని రూ.60వేలకు అమ్మేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నేరేడ్ మెట్ ప్రాంతంలో నివాసం ఉండే యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. కొన్ని నెలల తర్వాత అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత డీఎన్ఐ టెస్టులు చేయిస్తామని అధికారులు చెప్పారు. ఈ కేసు కొనసాగుతున్న క్రమంలో ఆమెకు నెలలు నిండి సెప్టెంబర్ 12,2020 శనివారం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో బిడ్డను ప్రసవించింది.
తరువాత పది రోజులకు ఘట్‌కేసర్ మండలం ఎదులబాద్‌కు చెందిన వ్యక్తికి రూ. 60 వేలకు బిడ్డను అమ్మేసింది. ఆమె ప్రసవించిందని తెలిసి బిడ్డను డీఎన్ఏ పరీక్షలు చేద్దామనుకున్న పోలీసులు బిడ్డ గురించి ఆమెను ఆరా తీయగా అమ్మేసినట్టు తేలింది. దీంతో బిడ్డను అమ్మిన ఆ యువతితో పాటు కొన్నివారిపై కూడా కేసు నమోదు చేసి..పసిబిడ్డను బాలల సదనంకు తరలించారు.