బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి రూ. కోటి 15లక్షలు దోపిడీ

  • Published By: murthy ,Published On : September 5, 2020 / 08:37 AM IST
బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి రూ. కోటి 15లక్షలు దోపిడీ

Updated On : September 5, 2020 / 9:13 AM IST

మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి దుండగులు రూ.1.15 కోట్లు దోచుకున్నారు. తన విధుల్లో భాగంగా  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అరంబం రంజన్ మైటీ (37) 16 ఏటీఎంలలో డబ్బు నింపటానికి వెళుతుండగా చుర్ చందా పూర్ శాఖ బయట సెప్టెంబర్ 4, శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.



గుర్తు తెలియని దుండగులు అతి దగ్గరనుంచి కాల్పులు జరపటంతో మైటీ అక్కడికక్కడే కుప్పకూలిపోగా…దుండగులు డబ్బు తీసుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు. జోవెంగ్ ఖుగా టాంపక్ నివాసి అయిన మైటీని మొదట చురాచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
https://10tv.in/mp-man-beheads-wife-to-please-deity-buries-body-at-home/
తీవ్ర గాయాలపాలైన మైటీని అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మధ్యాహ్నం ఇంఫాల్‌లోని షిజా ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.