టిక్ టాక్ ప్రేమ జంట ఆత్మహత్య

గుంటూరు జిల్లా..బెల్లంకొండ మండలం RR సెంటర్ లో ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కు చెందిన శైలజ(17).. మంగళగిరి కి చెందిన యువకుడు పవన్ కుమార్ (20) లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు..
ఇరువురు టిక్ టాక్ ద్వారా ప్రేమించుకుని ఆగస్టు 3 వతేదీన తిరుపతి లో పెళ్లి చేసుకుని … గుంటూరు జిల్లా మాచాయపాలెం ఆర్.ఆర్ సెంటర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు.
https://10tv.in/13-days-old-baby-uncle-who-drowned-in-a-drum-saying-he-could-not-sleep/
అమ్మాయి తల్లి తండ్రులు పవన్ కుమార్ ను చంపుతామని బెదిరించడం తో సూసైడ్ లెటరు రాసి ఆత్మహత్య చేసుకున్నారు.బెల్లంకొండ పోలీసులు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.