ఒడిషాలో దారుణం : 13 ఏళ్ల బాలికపై 36 గంటలపాటు అత్యాచారం

  • Published By: chvmurthy ,Published On : January 13, 2020 / 02:16 PM IST
ఒడిషాలో దారుణం : 13 ఏళ్ల బాలికపై 36 గంటలపాటు అత్యాచారం

Updated On : January 13, 2020 / 2:16 PM IST

ఒడిషాలో దారుణం జరిగింది. 13 ఏళ్లబాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. మహిళలు, యువతులపై దాడికిపాల్పడుతున్నవారిపై  పోలీసులు చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ యువతులపై అత్యాచారాలు ఆగటంలేదు.  గంజాం జిల్లాలోని బెర్హాంపూర్ లో  8 వతరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు దారుణంగా 36 గంటల పాటు నిర్భంధించి అత్యాచారం జరిపారు. తండ్రిలేని ఆ బాలిక తల్లితో కలిసి అమ్ముమ్మ, తాతయ్యల దగ్గర ఉంటోంది. బాలిక తల్లి కూలి పనులకు వెళుతూ ఉంటుంది. 

జనవరి 10 వతేదీ సాయంత్రం  ఆబాలిక బయటకు వెళ్లేందుకు తనకు తెలిసిన దనారా అనే కాలేజీలో చదువుకునే యువకుడిని తోడు రమ్మని కోరింది. అతడు అందుకు నిరాకరించాడు. తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి ఆమెను  నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని ఒక ఇంటిలోకి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆమె స్పహ కోల్పోయాక మొత్తం ముగ్గురు కలిపి ఆమపై సామూహిక అత్యాచారం చేసినట్లు బెర్హంపూర్  పోలీసు సూపరింటెండెంట్ పినాక్ మిశ్రా తెలిపారు. నిందితులు అపస్మారక స్ధితిలో ఉన్న బాలికను  ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. 

బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సునాపూర్  మెరైన్ పోలీసులు నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని  బాలికను వైద్యపరీక్షల నిమిత్తం బెర్హాంపూర్‌లోని ఎంకేసిజి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోక్సో చట్టం కింద, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  ఇప్పుడు ఈ కేసు మహిళా పోలీసు స్టేషన్ కు బదిలీ చేయబడింది.  ఆదివారం సాయంత్రానికి ఆమె పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకున్నాక స్టేట్ మెంట్  రికార్డు చేసి నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.