చంచల్ గూడ జైలుకు రవి ప్రకాష్ : 14 రోజుల రిమాండ్

నిధుల మళ్లింపు కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 18 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు కేసులో… శనివారం (అక్టోబర్5, 2019) సాయంత్రం రవిప్రకాశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశ పెట్టారు.
నిధుల మళ్లింపు వ్యవహారంలో ఉదయం రవిప్రకాశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ABCL బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమంగా 18కోట్లకు పైగా నిధులను డ్రా చేశారంటూ రవిప్రకాశ్, మూర్తిపై టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. ఉదయం నుంచి పలు ప్రశ్నలు సంధించారు. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజర్చిచారు. న్యాయస్థానం రవి ప్రకాశ్‌కు రిమాండ్ విధించింది.
రవిప్రకాశ్, మూర్తి ఇద్దరూ చెక్‌పవర్‌ను దుర్వినియోగం చేసినట్లుగా తేలింది. బోనస్, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసినట్లుగా కొత్త యాజమాన్యం గుర్తించింది. రికార్డుల తనిఖీల సమయంలో.. రవిప్రకాశ్ దోపిడీ బయటపడింది. రవిప్రకాశ్, మూర్తిపై సెక్షన్ 409, 418, 420, 509 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. టీవీ9 నిధులను బోర్డు సభ్యులకు తెలియకుండా మళ్లించటంపై ప్రశ్నించారు. రూ.18 కోట్ల రూపాయల వరకు అక్రమంగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఆధారాలతో సహా కంప్లయింట్ చేసింది టీవీ9 యాజమాన్యం. అనంతరం ఈ విషయంపై పోలీసులు అరెస్ట్ చేశారు.
చెక్ పవర్ దుర్వినియోగం చేసినట్లు, బోనస్, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసినట్లు తేలింది. కొత్త యాజమాన్యం రికార్డులు తనిఖీలు చేస్తుండగా ఈ మోసం వెలుగు చూసింది. డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు అనుమతి లేకుండా నిధులు డ్రా చేసినట్లు కొత్త యాజమాన్యం గుర్తించింది. క్లి ఫోర్డ్ పెరీరాకు అక్రమంగా…రూ. 5.97 కోట్ల బోనస్‌ను రవి ప్రకాశ్ జారీ చేసినట్లు తెలిసింది.
2017-18, 2018-19లో ఏబీసీఎల్‌కు వచ్చిన లాభాలకు సరిపడా నిధులను అక్రమంగా రవిప్రకాశ్, మూర్తిలు తీసుకున్నారని, సెప్టెంబర్ 18, 2018 నుంచి మే 8, 2019 మధ్య మూడు సార్లు బోనస్‌ల పేరిట డబ్బు డ్రా చేసినట్లు తనిఖీల్లో బయటపడింది.
2018 ఆగస్టులో ఏబీసీఎల్‌లో 90.54 శాతం షేర్లను అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఏబీసీఎల్ యాజమాన్య హక్కులు పూర్తిగా అలంద మీడియావే. అలంద మీడియా అనుమతి లేకుండా రవిప్రకాశ్, మూర్తిలు అక్రమంగా బోనస్ తీసుకున్నట్లు, బోనస్‌గా ఇచ్చినట్లు రికార్డుల్లో రాయమంటూ రవిప్రకాశ్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
రవిప్రకాశ్ అక్రమంగా తీసుకున్న డబ్బు
18.09.2018న రూ.1,80,00,000
11.03.2019న రూ.1,56,00,000
08.05.2019న రూ.3,00,00, 000
మొత్తం రూ.6,36,00,000
ఎంకేవీఎన్ మూర్తి అక్రమంగా తీసుకున్న డబ్బు
24.10.2018 & 10.12.2018న – రూ.3,97,87,500
08.05.2019న – రూ.2,00,00,000
మొత్తం రూ.5,97,00,000