గుండెలు పిండేస్తోంది : తండ్రి కారు కిందే పడి చిన్నారి మృతి

  • Published By: madhu ,Published On : February 15, 2019 / 03:16 AM IST
గుండెలు పిండేస్తోంది : తండ్రి కారు కిందే పడి చిన్నారి మృతి

Updated On : February 15, 2019 / 3:16 AM IST

ఓ తండ్రి చేసిన పొరపాటు..చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ ఇంట్లో అల్లరి చేష్టలు..ముద్దు ముద్దు మాటలు వినిపించకుండా పోయాయి. కన్నతల్లి దండ్రుల రోదన వర్ణానాతీతంగా ఉంది. తన పొరపాటుకు కొడుకు బలయ్యాడని ఆ తండ్రి గుండెలు అలిసేలా ఏడుస్తున్నాడు. ఈ విషాద ఘటన అందర్నీ కలిచివేసింది. మీర్‌పేట నందినిహిల్స్ కాలనీలో కృష్ణ, జ్యోతి దంపతులకు గౌతమ్ (20 నెలలు)తో పాటు మరొకరు సంతానం. కృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

2019, ఫిబ్రవరి 14వ తేదీ గురువారం యదావిధిగా డ్యూటీకి వెళ్లడానికని కృష్ణ సిద్ధమయ్యాడు. కారును బయటకు తీసి వెళ్లిపోయాడు. గౌతమ్ కనిపించకపోవడంతో జ్యోతి బయటకు వచ్చి చూసింది. పాపం..గౌతమ్ తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. దీనిని చూసిన జ్యోతి వెంటనే భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. గౌతమ్‌కు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.

 

తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. కారుని రివర్స్ చేస్తున్న సమయంలో.. కారు వెనక ఆడుకుంటున్న చిన్నారి కొడుకును గుర్తించలేకపోయాడు తండ్రి. రోజూలాగే తీశాడు. కొడుకు ఉన్నాడని సంగతి తెలియకపోవటం.. కారు ఢీకొని చనిపోయాడు ఆ చిన్నారి.